✍ఆ రూల్స్ తోనే కారుణ్య నియామకాలు: సుప్రీం
*🌻న్యూఢిల్లీ :* ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సమయంలో అమల్లో ఉన్న నిబంధనల ఆధారంగానే కారుణ్య నియామకాల విషయంలో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఉద్యోగి చనిపోయిన తర్వాత అమల్లోకి వచ్చిన రూల్స్ ను ఈ విషయంలో పరిగణనలోకి తీసుకోరాదని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి 2015లో మరణిం చగా, అప్పటి నిబంధనలను అనుసరించి ఉద్యోగి కుమారుడికి ప్రభుత్వం రూ.2లక్షల పరిహారం చెల్లించింది. అయితే 2016లో ప్రభుత్వం నిబంధనలను మార్చింది. ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే... వారి వారసులు లేదా డిపెండెంట్స్ కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వొచ్చని పేర్కొంది.
0 Comments:
Post a Comment