కరోనా నుంచి కోలుకున్నవారికి ఒక్క డోసు టీకా చాలు: ఐసీఎంఆర్!
న్యూఢిల్లీ: కరోనాలోని ప్రమాదకర డెల్టా ప్లస్ వేరియంట్‌కు అడ్డుకట్ట వేసేందుకు మార్గం దొరికింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్(ఐసీఎంఆర్) నిర్వహించిన అధ్యయనంలో ఒక కీలక అంశం వెల్లడయ్యింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఒకటి లేదా రెండు డోసులు తీసుకున్నవారితో... కరోనా నుంచి కోలుకుని, ఒకటి లేదా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారిని పోల్చిచూస్తే వీరు డెల్టా వేరియంట్ నుంచి అత్యధిక రక్షణ అందుకుంటున్నారని తేలింది.
దీని ప్రకారం చూస్తే కరోనా నుంచి కోలుకున్నవారు ఒక్క డోసు టీకా తీసుకున్నా వారికి వైరస్ నుంచి రక్షణ లభిస్తుందని ఐసీఎంఆర్ పేర్కొంది. హిమోరల్ అండ్ సెల్యూలర్ ఇమ్యూనిటీ అనేది డెల్టా వేరియంట్‌పై పోరాడుతూ రక్షణ అందివ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఇది ఇతర మ్యూటెడ్ స్ట్రెయిన్స్‌తో పోలిస్తే అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. కాగా దీనికిముందు ఐసీఎంఆర్ భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాల గురించి ఒక రిపోర్టు వెలువరించింది. దానిలో.. భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ వచ్చినప్పటికీ సెకెండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండదని పేర్కొంది. దీనికి దేశంలో టీకాల ప్రక్రియ వేగవంతం కావడమే కారణమని తెలిపింది. దీనివలస భవిష్యత్‌లో వచ్చే మరిన్ని వేవ్‌ల ప్రభావం తక్కువగా ఉండబోతోందని ఐసీఎంఆర్ తెలిపింది.
0 Comments:
Post a Comment