✍బదిలీ అయినా జాయినవ్వని టీచర్లపై చర్యలు
🌻సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత జనవరిలో నిర్వహించిన కౌన్సెలింగ్ బదిలీ ఉత్తర్వులు అందుకున్న టీచర్లలో జాయిన్ కాని వారికి షోకాజ్ నోటీసులిచ్చి చర్యలు తీసుకోవాలని రీజినల్ జాయింట్ డైరెక్టర్ల(ఆర్జేడీల)ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశించారు. ఈ మేరకు శనివారం సర్క్యులర్ జారీ చేశారు. అలాగే బదిలీ అయినా రిలీవర్ లేక తమకు కేటా యించిన స్కూళ్లలో జాయిన్ కాలేకపోయిన టీచర్లను రిలీవ్ చేయాలని, ఆ స్థానాల్లో ఎయిడెడ్ నుంచి వచ్చిన టీచర్లను లేదా 2008 డీఎస్సీ టీచర్లను నియమించాలని సూచించారు.
ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్ 2020 (జనవరి 2021) ద్వారా బదిలీ కాబడి పలు కారణాల వలన ఇంకనూ తమ బదిలీ కాబడిన స్థానాల్లో చేరనట్టి ఉపాధ్యాయులు రాష్ట్రంలో 41 మంది ఉన్నట్లు తమ దృష్టికి వచ్చినందున.....
వెబ్ కౌన్సిలింగ్ ద్వారా జారీ చేయబడిన బదిలీ ఉత్తర్వులను పాటించనందుకు గాను ఆయా ఉపాధ్యాయులకు షో కాజ్ నోటీసు జారీ చేయవలసిందిగా...
APCS(CCA) రూల్స్ 1991 ప్రకారం వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొనవలసిందిగా...
బదిలీ కాబడి సబ్ స్టిట్యూట్ లేని కారణంగా విధుల నుండి విడుదల కాలేని ఉపాధ్యాయుల విషయంలో.... ఎయిడెడ్ ఉపాధ్యాయులను గానీ / DSC 2008 ఉపాధ్యాయులను గానీ సదరు స్థానాలలో సర్దుబాటు చేసి బదిలీ కాబడిన వారిని విధుల నుండి విడుదల చేయవలసిందిగా...
అందరు RJD SE లను , DEO లను కోరుతూ పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
0 Comments:
Post a Comment