ఏపీలో మరో కొత్త శాఖ ఏర్పాటు.. ఉత్తర్వులు జారీ
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) సంక్షేమ శాఖను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ శాఖ పరిధిలోకి కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, కాపు, ఆర్యవైశ్య కార్పొరేషన్‌లు రానున్నాయి.
అలాగే జైన్‌ల సంక్షేమానికి, సిక్కుల సంక్షేమానికి వేర్వేరు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తూ రెండు జీవోలను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో వీటి ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. తాజాగా జీవోలను విడుదల చేశారు. మరోవైపు ఈబీసీలకు జగన్ ప్రభుత్వం ఈబీసీ నేస్తం అనే పథకాన్ని అమలు చేస్తోంది. దీని కోసం అర్హులైన మహిళలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలకు ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.15వేలు చొప్పున మూడేళ్లలో రూ.45వేల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది.
0 Comments:
Post a Comment