✍పాఠశాల గ్రంథాలయాలతో పౌర గ్రంథాలయాల అనుసంధానం
♦పాఠశాల విద్య రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్
*🌻గుంటూరు(విద్య), నవంబరు 15:* రాష్ట్రంలోని పౌర గ్రంథాలయాలను పాఠశాల గ్రంథాలయాలతో అనుసంధానం చేసి అక్షరాస్యత కార్యక్రమాలకు హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పాఠశాల విద్య రాష్ట్ర కార్యదర్శి బుడితి రాజశేఖర్ వెల్లడించారు. ఆదివారం గుంటూరులోని జిల్లా కేంద్ర గ్రంథాలయం నుంచి 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 909 శాఖా గ్రంథాలయాలు, 244 గ్రామీణ గ్రంథాలయాలు, 1792 పుస్తక పంపిణీ కేంద్రాలున్నాయని తెలిపారు. ఆయా గ్రంథాలయాల రూపురేఖల్ని మార్చి ప్రజలకు మరింత చేరువ చేసేలా కృషి చేస్తున్నట్లు వివరించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు వాటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
0 Comments:
Post a Comment