*📚✍ఆలస్యం చేస్తే కారుణ్య నియామకం దక్కదు : సుప్రీం
*🌻దిల్లీ*: ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ మర ణించిన వారి పిల్లలు కారుణ్య నియామకం కోసం సకాలంలో దరఖాస్తు చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఆలస్యం చేస్తే ఆ ఉద్యోగం లభించే అవకాశం ఉండ దని తీర్పు చెప్పింది. ఆధారం కోల్పోయిన ఆ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవడానికే కారుణ్య నియామకం ఇస్తుంటారని, దానిని పొందడా నికి జాప్యం చేస్తే తక్షణ సాయానికి అర్థమే ముంటుందని ప్రశ్నించింది. జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మా సనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) ఉద్యోగి కుమారునికి ఉద్యోగం ఇవ్వాలంటూ ఒరిస్సా హైకోర్టు, కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యు నల్ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే... మరణించిన సెయిల్ ఉద్యోగి పెద్ద కుమారుడు 1977లో తనకు ఉద్యోగం ఇవ్వాలంటూ సెయిల్ అధికా రులను కోరాడు. అయితే అప్పటికి కారుణ్య నియామకాల విధానం లేకపోవడంతో అధికా రులు దాన్ని తిరస్కరించారు. తిరిగి 1996లో చిన్న కుమారుడు ఇదే తరహా విజ్ఞప్తి చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ను ఆశ్రయించగా, అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీని పై 'సెయిల్' హైకోర్టులో అప్పీలు చేయగా అక్కడ కూడా ఈ తీర్పునకు మద్దతు లభిం చింది. దీనిపై మళ్లీ సెయిల్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. 18 ఏళ్లు ఆలస్యంగా దరఖాస్తు చేసి నందున తాత్కాలిక సాయం అన్న మాటకు అర్థం లేదని, అందువల్ల కారుణ్య నియామకం పొందడానికి అర్హత లేదని తెలిపింది.
0 Comments:
Post a Comment