తుపాను ముప్పు తప్పినట్టే కానీ..నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి బలహీనపడే అవకాశం...భారీ, అతి భారీ వర్షాలు కురిసే ప్రాంతాలివి
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: బంగాళాఖాతంలో పరిస్థితులు సహకరించకపోవడంతో రాష్ట్రానికి తుపాను ముప్పు తప్పింది.
కానీ.. భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలుల ప్రభావం ఉంటుంది. ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్ర స్తుతం సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో కొన సాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయా ణించి రాగల 36 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం.. తీవ్ర వాయుగుండంగా బలపడుతూ ఈ నెల 18 నాటికి నైరుతి బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్-తమిళనాడు తీరాలకు సమీపించనుం ది. ఇది తుపానుగా మారకుండా తీవ్ర వాయుగుండం లేదా వాయుగుండంగా బలహీన పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో మంగళవారం నుంచి రాష్ట్రంలో మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయన్నారు.
భారీ, అతి భారీ వర్షాలు కురిసే ప్రాంతాలివి
► మంగళవారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక ట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయి.
► 17న ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, వైఎస్సార్, కర్నూలు, అనం తపురం జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం.
► 18న ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం.
► 19నవిజయనగరం,విశాఖపట్నం,ఉభయ గోదా వరి, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం.
18 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు
► సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. 16వ తేదీ నుంచి 18 వరకు తీరం వెంబడి గంటకు గరిష్టంగా 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 18 వరకు మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. అనంత జిల్లా గాండ్లపెంట మండలంలో 235 మి.మీ. వర్షపాతం నమోదైంది.
0 Comments:
Post a Comment