స్వర్గ రేఖ!..ఏమిటీ స్వర్గ రేఖ తప్పకుండా తెలుసుకుందాం..!!
సౌదీ అరేబియా ఎడారుల్లో మెట్రో నగరం
ఒకే లైన్‌లో 170 కిలోమీటర్ల నిర్మాణం
ప్రమాదాలు జరగకుండా భూగర్భంలో లేయర్లు
7.5 లక్షల కోట్లతో మూడేండ్లలో పూర్తి
ప్రపంచంలోనే అత్యాధునిక నగరానికి అంకురార్పణ జరిగింది.
ఐదు దశాబ్దాలు నిర్విరామ కృషి చేసినా సాకారం కాని.. ఓ మహాద్భుత సిటీని మరో మూడేండ్లలో అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. కాలుష్యమన్నదే లేని ఆ నగరమే 'స్వర్గ రేఖ' (లైన్ ఆఫ్ ప్యారడైజ్). ఎడారి దేశం సౌదీ అరేబియాలో ఈ నగర నిర్మాణం ఇటీవలే ప్రారంభమయ్యింది.
–నేషనల్ డెస్క్
ఏమిటీ స్వర్గ రేఖ?
వాయవ్య సౌదీ అరేబియాలోని టబుక్ ప్రావిన్సు నుంచి ఎర్ర సముద్రాన్ని కలుపుతూ.. ఎలాంటి వీధులు లేకుండా.. ఒకే సరళ రేఖ నిర్మాణంలో ఈ సిటీని నిర్మిస్తున్నారు. దీనినే 'స్వర్గ రేఖ'గా పిలుస్తున్నారు. 170 కిలోమీటర్ల పొడవుతో ఉండే ఈ 'స్వర్గ రేఖ'ను మూడు లేయర్లుగా నిర్మిస్తున్నారు.
ఎందుకు ఈ నగరం?
పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, రోడ్డు ప్రమాదాలను నివారించడం, వేగవంతమైన సేవలను అందించమే ఈ నగరం లక్ష్యం.
ఖర్చెంత?
రూ. 7.5 లక్షల కోట్లతో ఈ నగరాన్ని నిర్మిస్తున్నారు. 2024లో అందుబాటులోకి రానున్న ఈ నగరంలో 10 లక్షల మంది వరకు నివసించవచ్చు. ఈ నిర్మాణంతో 3.8 లక్షల మందికి ఉపాధి లభించనున్నది.
ఉపరితల నగరం: వాహనాలను అనుమతించబోరు. కేవలం ప్రజలు నడవడానికే అనుమతిస్తారు. సరళరేఖ మీద నాలుగు ప్రధాన ప్రాంతాల్లో పర్యావరణహిత రెసిడెన్షియల్ సముదాయాలను నిర్మిస్తారు. ఇందులోనే పాఠశాలలు, రెస్టారెంట్లు, దుకాణాలు కూడా ఉంటాయి. కేవలం ఐదు నిమిషాల నడకతో ఈ ప్రాంతాలను చేరుకోవచ్చు.
భూగర్భ నగరం-1: ఉపరితల నగరం కింద.. భూగర్భంలో దీన్ని నిర్మిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలు, వైద్య సేవలు, డెలివరీ వస్తువులు ఈ ప్రాంతంలో అందుబాటులో ఉంటాయి.
భూగర్భ నగరం-2: భూగర్భ నగరం-1 కింద ఇది ఉంటుంది. ప్యాసింజర్, గూడ్స్ సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కృత్రిమ మేధ సాయంతో అల్ట్రా హైస్పీడ్‌తో ఇవి పనిచేస్తాయి.
0 Comments:
Post a Comment