✍అమ్మఒడికి హాజరు కౌంట్ - రోజు ప్రారంభంలోనే అప్లోడ్.. నెట్వర్క్ లేని ప్రాంతాల్లో కష్టాలు
*🌻అమరావతి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి)*: అమ్మఒడికి ఇకనుంచి హాజ రును లెక్కించనున్నారు. ఈ విద్యాసంవత్సరం చదివే పిల్లలకు వచ్చే జూన్లో అమ్మఒడి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికోసం 75 శాతం హాజరును తప్పనిసరి చేసింది. ఈ హాజరు లెక్కను సోమవారం నుంచి పరిగణలోకి తీసుకోవాలని అధికారులు నిర్దేశించారు. హాజరును అప్ లోడ్ చేసేందుకు ప్రత్యేక యాప్ రూపొందించారు. ఉపాధ్యాయులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రతిరోజూ ఉదయం మొదటి తరగతిలోనే తాము భౌతికంగా తీసుకున్న హాజరును అందులో అప్లోడ్ చేయాలి. అయితే సోమ, మంగళవారాల్లో దీనికోసం ప్రయత్నాలు చేయగా.... కొన్నిచోట్ల నెట్వర్క్ సమస్య ఎదురైంది. నెట్వర్క్ సరిగా లేనిచోట్ల యాప్లో హాజరు నమోదుచేసి సబ్మిట్ చేయడం కష్టమైంది. ప్రతిరోజు హాజరు నమో దుచేయకుంటే పాఠశాలల హెడ్మాస్టర్లపై చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ ఉన్నతాధికారులు హెచ్చరించారు. ఇలా యాప్ ద్వారా హాజరు అప్ లోడ్ చేయడానికి కనీసం 10 నిమిషాల సమయం పడుతుంది. నెట్వర్క్ సరిగా లేకుంటే అప్లోడ్ కావడానికి మరింత సమయం పడుతోంది.
0 Comments:
Post a Comment