విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆధ్వర్యంలో సుహృద్భావ వాతావరణంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం
4వ జోన్ లో జారీ చేసిన చార్జి మెమో లను రద్దు చేస్తాం: ముఖ్య కార్యదర్శి
నేడు విద్యారంగ - ఉపాధ్యాయుల సర్వీస్ మేటర్ లపై విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ.బి. రాజశేఖర్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని ఉపాధ్యాయ సంఘాలు STU, UTF, APTF:1938 రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో సమావేశం ఇబ్రహీంపట్నం లోని పాఠశాల విద్య డైరోక్టరెట్ లో రాత్రి వరకు జరిగింది.
మూడు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఉపాధ్యాయుడికి బోధనేతర పనులైన యాప్స్, పరిశుభ్రత, ఆన్లైన్ హాజరు తదితర పనుల వల్ల బోధనకు తీవ్ర ఆటంకం కలుగుతుందని తెల్పారు. తప్పు లేకపోయినా మెమో లు ఇస్తున్నారని, వాటిని రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపకల్పన చేసి అన్ని క్యాడర్ల పదోన్నతులు, జేయల్ పదోన్నతులు, నాడు నేడు పనులు పూర్తి చేసిన వారికి ఈ.యల్స్, అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా బదిలీలు, 3,4,5 తరగతుల వీలీనం, అమ్మ ఒడి కి సంబంధించి హాజరు, 2003 DSC టీచర్లకు & 2002 పండిట్ల కు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపు తదితర అనేక సమస్యలను ముఖ్య కార్యదర్శి గారికి వివరించడం జరిగింది.
ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ గారు అనేక విషయాలపై మాట్లాడుతూ యాప్స్ భారం తగ్గిస్తామని, అన్ని కేడర్ల పదోన్నతుల కల్పనకు కృషిచేస్తున్నామని, 4వ జోన్ లో HM లకు జారీ చేసిన 2500 చార్జి మెమో లను రద్దు చేస్తామని, జీతాల సమస్య ఉన్న వాటిని అధికమించి జీతాల మంజూరు చేస్తామని అన్నారు. సంఘాలు - ప్రభుత్వం సమన్వయంతో పని చేసి పేద విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేద్దామని తెల్పారు. డైరెక్టర్ చిన వీరభద్రుడు మాట్లాడుతూ ఇకనుండి క్షేత్ర స్థాయిలో ప్రధానోపాధ్యాయులు, టీచర్లను, సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలను అధిగమించి విద్యావ్యవస్థను ప్రగతి పథంలో నడిపిద్దామని అన్నారు. SPD వెట్రి సెల్వి, IAS అధికారులు మురళి, MDM మైదెన్ లు మాట్లాడారు.
ఈ సమావేశంలో సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ సంఘాలు STU నుండి రఘునాథ రెడ్డి, సురేష్, UTF నుండి యన్.వెంకటేశ్వర్లు, KVVS ప్రసాద్, APTF:1938 నుండి జి.హృదయ రాజు, కె.కులశేఖర రెడ్డి, విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ లు ప్రతాప్ రెడ్డి, సుబ్బారెడ్డి, రామలింగం, నాగేశ్వర రావు, మధుసూదన్ రావు, రవీంద్ర నాథ్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
APCSJSC Teacher Union's meet postponed to 17.11.2021 @ O/O DSE
0 Comments:
Post a Comment