AP NGO మాజీ నేత N చంద్రశేఖర్ రెడ్డి గారిని రెండు సంవత్సరాల కాలపరిమితితో ప్రభుత్వ సలహాదారుడు గా నియామిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం
తనను ప్రభుత్వ సలహాదారుగా నియమించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు చంద్రశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకానికి తగినట్లుగా, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మికుల సమస్యలను ప్రభుత్వం ద్వారా పరిష్కరించేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. ఉద్యోగులకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సీఎం వైఎస్ జగన్ ఆశయం నెరవేర్చుటకు కృషి చేస్తానన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మికులు ఏ సమస్య గురుంచి అయినా, ఎప్పుడైనా తన వద్దకు రావొచ్చని సూచించారు. ఉద్యోగుల న్యాయపరమైన కోర్కెలు నెరవేరే విధంగా కృషి చేస్తానని చంద్రశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు.
0 Comments:
Post a Comment