ఇది వెనకడుగా.. రాజకీయ వ్యూహమా? ప్రభుత్వం ముందున్న ఆప్షన్లేంటి..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల విషయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఇది జగన్ సర్కార్ వెనకడుగా భావించాలా? రాజకీయ వ్యూహమా అన్న కోణంలో పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
అయితే.. సీఎం జగన్ ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నారని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతోంది.
ఏ కోర్టూ అడ్డుకట్ట వేయలేని విధంగా కొత్త బిల్లు రూపకల్పన కోసం మూడు రాజధానుల బిల్లును ఏపీ సర్కారు ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. ఇక మండలిలో వైసీపీ ఆధిపత్యం రావడం , కోర్టుల విషయంలో అవగాహన రావడంతో ఈ సారి పకడ్బందీగా బిల్లు రూపకల్పన ఉండనున్నట్టు సమాచారం. విషయం ఏంటీ అంటే. కౌన్సిల్ లో బిల్ హోల్డ్ అయింది. సెలెక్ట్ కమిటీ కి రిఫర్ చేస్తున్నా అని చైర్మన్ అన్నారు. అది బిల్ ఫామ్ అవ్వలేదు.. ఆ కోణం లో కోర్ట్ లో దెబ్బ పడే అవకాశం ఉంది.. అందుకే ఫ్రెష్ బిల్.. ఇప్పుడు కౌన్సిల్ లో సంపూర్ణ మెజారిటీ ఉంది కాబట్టి ఆ అడ్డంకి కూడా ఉండదు.. అని చాలామంది భావిస్తున్నారు.. కాగా, రాజధాని ఏర్పాటుపై జగన్ ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని జగన్ అసెంబ్లీలో ప్రకటించనున్నారని అధికార వర్గాల సమాచారం.
దీనికి ఏపీ ప్రభుత్వం ముందు 4 ఆప్షన్లు ఉన్నట్టు తెలుస్తోంది.
ఆప్షన్1 : న్యాయపరమైన చిక్కులు లేకుండా 3 రాజధానులకు కొత్త బిల్లు..
ఆప్షన్2 : సాంకేతికంగా 3 రాజధానులను ప్రస్తావించకుండా అధికార వికేంద్రీకరణ
ఆఫ్షన్3 : పూర్తిస్తాయి రాజధానిగా అమరావతి అని చెప్తూనే మిగతా ప్రాంతాల అభివృద్ధి
ఆష్షన్4: పరిపాలనా రాజధాని విశాఖ అని చెప్తూనే అమరావతిలో పాలనా వ్యవహారాలు
AP 3 Capitals: అది మోదీ ప్రభుత్వం.. ఇది జగన్ ప్రభుత్వం..: పేర్ని నాని
అమరావతి: తాము ఏ నిర్ణయం తీసుకున్నా, ప్రజల మంచి కోసమేనని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రస్తుతం ఉన్న మూడు రాజధానుల వికేంద్రీకరణ బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు సీఎం జగన్ మోహన్‌రెడ్డి శాసనసభలో ప్రకటించారు.
అంశాలను పరిగణనలోకి తీసుకుని పూర్తి సమగ్రమైన బిల్లుతో మళ్లీ సభ ముందుకు వస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శాసనసభ నుంచి బయటకు వచ్చిన మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.
''ఎవరో ఒకరి కోసం జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవటం, వ్యవస్థలను నడపటం చేయదు. ఈ ప్రభుత్వానికి అనేక విజ్ఞాపనలు వస్తున్నాయి. రాజధాని వికేంద్రీకరణపై టెలివిజన్ ఛానళ్లు తప్పుగా ప్రచారం చేస్తున్నాయి. మూడు రాజధానులు ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నామో ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాకు అనిపించింది. అందుకే మరోసారి సమగ్ర బిల్లును తీసుకొస్తాం. తమ ప్రాంతాలకు కావాల్సిన అవసరాలను బిల్లులో పొందుపరచాలని ఎవరైతే ఆకాంక్షిస్తున్నారో వారి అభిప్రాయాలను కూడా క్రోడీకరించి మళ్లీ బిల్లులో జత చేస్తాం. అప్పుడు సభ ముందుకు తీసుకొస్తాం''
''ఈసారి కోర్టు జోక్యం లేకుండా ప్రభుత్వం చట్టం చేయాలనుకుంటోందనేది ఊహాజనితం. అవన్నీ ఒక టెలివిజన్ ఛానల్, రాజకీయ విశ్లేషకులు చెప్పేవి. మాకు వ్యతిరేకంగా కోర్టు ఎన్నో తీర్పులు ఇచ్చింది. మేము ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసమే. కొన్నిసార్లు మాకు వ్యతిరేకంగా కోర్టులో తీర్పు రావచ్చు. దానికీ దీనికి సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంది. మేము అలా చేయటం లేదు. అది మోదీ ప్రభుత్వం.. ఇది జగన్ ప్రభుత్వం.. మళ్లీ అన్ని ప్రాంతాల వారి అభిప్రాయాలను, ఆకాంక్షలను తీసుకుని బిల్లు తయారు చేస్తాం. బిల్లు ఎప్పటిలోగా తీసుకొస్తామన్నదానికి సమయం ఏమీ లేదు'' అని పేర్ని నాని పేర్కొన్నారు.
CM Jagan: రాజధాని అంశంపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన.
రాజధానుల అంశంపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ఏ పరిస్థితుల్లో 3 రాజధానులు తీసుకువచ్చామో బుగ్గన వివరించారని పేర్కొన్నారు. ఈ ప్రాంతం అంటే తనకు ప్రేమ ఉందన్నారు సీఎం జగన్.
అమరావతి అంటే ఎటువంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. తన ఇల్లు కూడా అమరావతిలో ఉందని చెప్పారు. రాష్ట్రమంతా అభివృద్ది చెందాలన్నదే తన తాపత్రయమన్నారు. రాష్ట్రంలో అతి పెద్ద నగరం విశాఖ అని చెప్పారు. అక్కడ అన్ని మౌళిక సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. ఇంకొన్ని జమ చేస్తే.. వైజాగ్.. హైదరాబాద్ వంటి పెద్ద నగరాలతో పోటీ పడే పరిస్థితి ఉంటుందన్నారు. వాస్తవాలను గుర్తెరిగే.. అన్ని ప్రాంతాల అభివృద్ది గురించి 3 రాజధానులు బిల్లును తీసుకొచ్చామని జగన్ చెప్పారు. రాజధాని ప్రాంతం అటు గుంటూరు, విజయవాడలో లేదన్నారు. అమరావతిలో రోడ్లు, డ్రెయినేజీలు, కరెంటు వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి రూ.లక్ష కోట్లు అవుతాయని గత ప్రభుత్వం చెప్పిందన్నారు. ఈ రోజు అయ్యే రూ.లక్ష కోట్ల ఖర్చు పదేళ్ల తర్వాత 6,7 లక్షల కోట్లు అవుతుందన్నారు. కనీస సౌకర్యాలు కల్పించేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే.. రాజధాని నిర్మించడం సాధ్యమవుతుందా అని జగన్ సూటిగా ప్రశ్నించారు. అప్పట్లో అన్ని నివేదికలను ఉల్లంఘించి గత ప్రభుత్వంలో చంద్రబాబు రాజధానిని ఏర్పాటు చేశారని విమర్శించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని.. రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపియల్ పెట్టాలని.. అమరావతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చందుకు శాసన రాజధాని ఏర్పాటు చేయాలని.. కర్నూలు ప్రజల ఆకాంక్షలను గుర్తించి న్యాయరాజధాని ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలనే తపనతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు జగన్ వెల్లడించారు. వికేంద్రీకరణకు సంబంధించి అనేక అపోహలు, అనుమానాలు, కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలనే ప్రచారం చేశారని జగన్ అన్నారు.
బిల్లు ఆమోదం పొందిన వెంటనే.. ప్రక్రియ ప్రారంభమై ఉంటే.. అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్తే.. ఇప్పటికి ఫలాలు అందుతూ ఉండేవని సీఎం చెప్పారు. కానీ ఆ పరిస్థితుల లేనందున 3 రాజధానులపై.. సమగ్రమైన బిల్లును తీసుకొస్తామన్నారు. ఇంతకు ముందు బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. విసృత, విశాల ప్రజా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయమన్నారు. చట్ట, న్యాయపరంగా అందరికీ సమాధానాలు చెప్పే విధంగా మళ్లీ సమగ్రమైన బిల్లును తీసుకొస్తామన్నారు. బిల్లులోని సదుద్దేశం అందరికీ వివరిస్తామన్నారు. ఇంకా ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే చేస్తామన్నారు.
AP అసెంబ్లీ లైవ్...లైవ్...
AP 3 Capitals Bill: 'ఇప్పుడు ఇంటర్వెల్ మాత్రమే.. శుభం కార్డుకు చాలా సమయం ఉంది
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి
సాక్షి, అమరావతి: మూడు రాజధానుల చట్టం ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యాయపరమైన చిక్కుల వల్లే ఈ పరిస్థితి ఉండొచ్చు. కేబినెట్ సమావేశంలో నేను లేను. పూర్తి వివరాలు తెలీదు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం. ఇప్పుడు ఇంటర్వెల్ మాత్రమే. శుభం కార్డుకు చాలా సమయం ఉంది. రాజధాని పేరుతో ఉద్యమం చేసేది పెయిడ్ ఆర్టిస్టులే అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.
ఇదే విషయంపై మంత్రి కొడాలి నాని స్పందిస్తూ.. కొందరు కోర్టుకెళ్లి అడ్డంకులు సృష్టించారు. అమరావతిపై ఏపీ కేబినెట్‌లో చర్చించాం. కేబినెట్ నిర్ణయాన్ని అసెంబ్లీలో వివరిస్తామని మంత్రి కొడాలి నాని అన్నారు.
కాగా, మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కాసేపట్లో అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ అధికారికంగా ప్రకటిస్తారని ఏజీ కోర్టుకు తెలిపారు.
AP News: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
అమరావతి: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కీలకమైన మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్లు అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు ఆయన వివరాలను నివేదించారు. మరోవైపు సీఎం జగన్ కాసేపట్లో ఏపీ అసెంబ్లీలో దీనిపై ప్రకటన చేయనున్నారు.
మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ఐకాస ఆధ్వర్యంలో సుమారు రెండేళ్లుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ అమరావతి రైతులతో సహా పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీనిపై ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ కేసులు నడుస్తున్నాయి. రాజధాని కేసులపై హైకోర్టు తాజాగా రోజువారీ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ మూడు రాజధానుల బిల్లులను ఉపసంహరించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజా సమాచారం కోసం....ఈ పేజీ ని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.....
0 Comments:
Post a Comment