AP Job Mela: ఏపీలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. రూ. 18,500 వేతనం.. ఇలా అప్లై చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డవల్మెంట్ కార్పొరేషన్(apssdc) నుంచి మరో జాబ్ మేళా(Job Mela)కు సంబంధించిన ప్రకటన విడుదలైంది.
ప్రముఖ Apollo Pharmacy, meesho, Navata Road Transport లో ఖాళీలను (Jobs) భర్తీ చేయడానికి జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్లో (Job Notification) పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ www.apssdc.in లో రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. అనంతరం ఈ నెల 27న ఉదయం 10 గంటలకు కృష్ణా జిల్లాలో(Krishna District) నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
అర్హతల వివరాలు..
1.Meesho సంస్థలో సేల్స్ ఆఫీసర్(Sales Officer) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్, ఆపై విద్యార్హతలు కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు కనీసం 6 నెలల నుంచి మూడేళ్ల పాటు అనుభవం ఉండాలని తెలిపారు. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 18, 500 వేతనం అందించనున్నట్లు స్పష్టం చేశారు. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థుల వయస్సు 19 నుంచి 32 ఏళ్లు ఉండాలి.
2.Apollo Pharmacy: ఈ సంస్థలో Pharmacist, Pharmacy Trainee/Assistant విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
a)ఫార్మసిస్ట్(Pharmacist): బీ/డీ/ఎం ఫార్మసీ చేసి PCI సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 11500 నుంచి రూ. 14 వేల వరకు వేతనం అందించనున్నారు. పురుషులు, స్త్రీలు ఎవరైనా ఈ ఖాళీలకు దరఖాస్తు చుసుకోవచ్చని స్పష్టం చేశారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలని తెలిపారు.
b)Pharmacy Trainee/Assistant: టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 9500 నుంచి రూ.10,500 వరకు వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని ప్రకటనలో స్పష్టం చేశారు.
3. Navata Road Transport: క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్ విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 8500 నుంచి రూ. 10 వేల వేతనం చెల్లించనున్నారు. అయితే.. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
ఇతర వివరాలు: అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో Resume, విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, ఆధార్ కార్డును వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
-ఎంపికైన అభ్యర్థులు విజయవాడలో పని చేయాలని ప్రకటనలో తెలిపారు.
-ఇతర వివరాలకు 8074370846, 6300618985 నంబర్ల ను సంప్రదించాలని సూచించారు.
ఇంటర్వ్యూ నిర్వహించే వేధిక: Rural Skill Centre, Kurumaddali, Pamarru Mandal, Krishna District చిరునామాలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.
0 Comments:
Post a Comment