Andhrapradesh Local Body Elections: ఏపీలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. మిగిలిన కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections)కు నోటిఫికేషన్ విడుదలైంది.
వివిధ కారణాలతో గతంలో ఎన్నికలు నిర్వహించని నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్(Election Schedule) విడుదల చేశారు. 533 వార్డులు, 85 ఎంపీటీసీలు, 11 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లు(Nominations) స్వీకరించనున్నారు. పంచాయతీలకు ఈనెల 14న, మున్సిపాలిటీలకు 15న, ఎంపీటీసీ(MPTC), జడ్పీటీసీ(ZPTC) స్థానాలకు 16న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈనెల 15న నెల్లూరు కార్పొరేషన్ ఎన్నిక(Nellore Corporation Election)లు కూడా జరగనున్నాయి. ఈనెల 17న మున్సిపాలిటీ, 18న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ సారి ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
2019 ఎన్నికల నుంచి ఏపీలో అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ ఘన విజయాన్ని సాధిస్తోంది. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుపును అందుకుంది. ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. టీడీపీ ఈసారైనా పరువు నిలుపుకోవాలని చూస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
0 Comments:
Post a Comment