Andhra Pradesh: ఆ ప్రభుత్వ సలహాదారు ఏమైపోయారు.. అవసరానికి కనిపించకపోతే ఎలా అంటూ ఆవేదన
Where is Andhra Pradesh Government Adviser: APNGO అధ్యక్షుడిగా పనిచేసిన చంద్ర శేఖర్ రెడ్డికి (Chandra Sekhar Reddy) ప్రభుత్వ పెద్దల దగ్గర మంచి గుర్తింపు ఉంది.
దీంతో పదవీ విరమణ చేయగానే ఏపీ ప్రభుత్వం (AP Government) ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని భావించింది. ఆలస్యం చేయకుండా ఆయనను ఉద్యోగులకు సంబంధించిన అంశంపై సలహాదారుగా నియమించింది. ఆయనే చంద్రశేఖర్‌రెడ్డి.. ఆయనను సలహాదారుగా నియమించారో లేదో.. ఆ వెంటనే పీఆర్సీ (PRC) అమలు కోసం ప్రభుత్వంపై ఉద్యోగుల నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. ఇలాంటి సమయంలోఉద్యోగుల సాదకబాదకాలు.. ఉద్యోగులు ఎవరి మాట చెబితే వింటారో అన్ని విషయాలు తెలిసిన చంద్రశేఖర్ రెడ్డి కీలక పాత్ర పోషించాలి. సమస్య పరిష్కారానికి చొరవ చూపించాలి.. అది కుదరనప్పుడు కనీసం ఉద్యోగుల సమస్యలను
ప్రభుత్వానికి తెలిసేలా చేయాలి. అది కుదరదంటే.. ఉద్యోగులకు వాస్తవ పరిస్థితులను వివరించాల్సి ఉంటుంది.
ఇటీవల జరుగుతున్న పరిణామాల్లో ఎక్కడా చంద్రశేఖర్ రెడ్డి ఆ తరహా పాత్ర పోషించిన.. పోషిస్తోన్న దాఖలాలు కన్పించడం లేదనే చర్చ ఉద్యోగ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఏపీ రాజధాని (AP Capital )లో సీరియస్‌గా చర్చలు జరుగుతుంటే రెడ్డిగారు కడప జిల్లా (Kadapa District)లో సన్మానాలు చేయించుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు.
పీఆర్సీ నివేదిక కోసం ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆ మధ్య దాదాపు 5 గంటలపాటు సచివాలయంలో బైఠాయించి చిన్నసైజు ఆందోళన
నిర్వహించారు. ప్రభుత్వం వైపు నుంచి ఎవ్వరూ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యోగులు. చివరకు నెలాఖరులోగా PRC
సమస్యను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు అల్టిమేటం ఇచ్చాయి.
ఈ మధ్యకాలంలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. ఇది ప్రభుత్వంపై
తీవ్ర ప్రభావం చూపే అంశం. గతంలో అంటే ప్రభుత్వం.. దాని తరఫున అధికారులు సంఘాలతో చర్చించి సర్దుబాటు చేసుకునేవారు. కానీ..
ఇప్పుడు ప్రత్యేకించి.. పైగా ఏరికోరి ఓ సలహాదారుడిని నియమించుకుంటే ఫలితం లేకుండా పోయిందనే భావన వ్యక్తమవుతోంది.
వాస్తవంగా రోజువారీ వ్యవహారాల్లో ఉద్యోగుల విషయాల్లో ఇవ్వడానికి సలహాలు ఏమీ ఉండవట. PRC వంటి కీలక విషయాల్లోనే చేస్తే
ఏదైనా చేయవచ్చు. అలాంటిది ఇప్పుడే గాయబ్ అయితే ఇక ఆయన ఎందుకు? ఆయనకు ఆ పదవి ఎందుకు అనే విమర్శ వినిపిస్తోంది.
ఇప్పటికే ప్రభుత్వం తీరుపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని.. కనీసం
ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను నినడానికి కూడా ప్రభుత్వానికి సమయం లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడ ఈ సలహా
దారు పదవి ఎందుకని నిలదీస్తున్నారు.,
సచివాలయంలో బైఠాయింపు జరిగిన సందర్భంలోనే పరిస్థితి తీవ్రతను చంద్రశేఖర్‌రెడ్డి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఉంటే ఇంత వరకు
వచ్చేది కాదని.. ఈ స్థాయిలో విమర్శలు ఉండేవి కావని ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. చంద్రశేఖర్‌రెడ్డిని ఉద్యోగ వ్యవహారాల
సలహాదారుగా నియమించే సందర్భంలోనే APNGO మినహా.. ఇతర ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలుస్తోంది.
ఆయన్ను సలహాదారుగా నియమించ వద్దని సూచించినట్టు సమాచారం. కానీ ప్రభుత్వం రెడ్డి సినియారిటీని దృష్టిలో పెట్టుకుని ఆయన్ను
సలహాదారుగా నియమించుకుందని ప్రచారం ఉంది. దీంతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా ఏం చేయలేక సైలెంట్ అయ్యారు.
ప్రస్తుతం పరిస్థితేల్లో చంద్రశేఖర్‌రెడ్డి మరింత బాధ్యతతో వ్యవహరిస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సలహాదారుగా తన
నియామకాన్ని వ్యతిరేకించిన వారిని కూడా కలుపుకొని వెళ్లి.. వారికి నచ్చచెప్పి.. ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత
చంద్రశేఖర్ రెడ్డి మీద ఉందని.. కాని ఆయన అంటి అంటన్నట్టు వ్యవహరిస్తే ఆ ప్రభావం ప్రభుత్వంపైనా పడుతుంది.
ఇప్పటికే ప్రభుత్వం తీరుపై ఉద్యోగ సంఘాల నేతలు గుర్రుగా ఉన్నారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల సమయంలో కుప్పం, ఆకీవీడు ఎన్నికల్లో పోస్ట్
బ్యాలెట్ ఓట్లు జీరోగా ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. అంటే ప్రభుత్వం ఉద్యోగులు, సిబ్బంది ఓటు వేయడానికి కూడా ఇష్టపడడం లేదన.. అదే
అసెంబ్లీ ఎన్నికలైతే ప్రత్యర్థి పార్టీలకు ఉద్యోగ సంఘాలు ఓట్లు పడేవి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైనా సలహాదారుగా
చంద్రశేఖర్ రెడ్డి ముందుకు వచ్చింది.. ఉద్యోగులను ప్రభుత్వానికి కల్పిస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే ఈ గ్యాప్
మరింత పెరిగే ప్రమాదం ఉంది.
super
ReplyDelete