ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక దుస్థితి!
బిజినెస్ స్టాండర్ద్ కధనం!
ఉచితాలకి చేసిన ఖర్చు 50,419.15 కోట్లు.
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు 662% నికి చేరుకుంది. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరం అర్ధ భాగానికి మాత్రమే!
కాగ్ రిపోర్ట్ ప్రకారం 2021-22 ఆర్ధిక సంవత్సరానికి (ఆరు నెలల కాలానికి) గాను 1,04,804.91 కోట్ల ఆదాయం సమకూరింది దీనిలో 39,914.18 కోట్ల రూపాయలు అప్పుల రూపంలో సమకూర్చుకున్నది.
అయితే దీనిలో సగభాగం 50,419.15 కోట్ల రూపాయలు ఉచిత సంక్షేమ పథకాలకు,గతంలో చేసిన అప్పులకు గాను వడ్డీలు,సబ్సిడీ బిల్లులు,జీతాలు, పెన్షన్లకి,మొత్తం కలిపి 1,04,723.91 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.అంటే వచ్చిన ఆదాయానికి అప్పులు జోడిస్తే హళ్ళికి హళ్లి!
ఉచితాలకి చేసిన ఖర్చు 50,419.15 కోట్లు.
2021/22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ లో 5 వేల కోట్లు రెవెన్యూ లోటు ఉండవచ్చు అని అంచనా వేశారు.కానీ ఏప్రిల్ నెల నుండి సెప్టెంబర్ నెల వరకే లోటుRs 33,140.62కి చేరుకుంది అంటే 662% అన్నమాట! ఎదో 5వేల కోట్లకి మరో 5వేల కోట్లు అయితే అంచనా తప్పింది అని సరిపెట్టుకోవచ్చు కానీ మరీ 662% శాతం అదీ 6నెలలు ఇంకా మిగిలి ఉండగానే అంటే రాబోయే 6 నెలల్లో ఇంకెంత లోటు పెరుగుతుందో ఊహిస్తేనే భయంగా ఉంది.
2021-22 ఆర్ధిక సంవత్సరం నికి 37,029.79 కోట్ల రూపాయిల్ని రుణంగా తీసుకోవాలని బడ్జెట్ లో ప్రతిపాదన ఉంది కానీ 6 నెలలకే 39,914.18 కోట్లు ఋణ రూపంలో సేకరించింది రాష్ట్ర ప్రభుత్వం.అంటే 6 నెలలకే సంవత్సరం మొత్తంలో సేకరించాల్సిన ఋణం కంటే 2 వేల కోట్లు ఎక్కువగా తీసుకుంది ప్రభుత్వం. మరి వచ్చే 6 నెలల సంగతి ఏమిటీ?
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ అధికారులు ప్రతీ సమీక్షా సమావేశాల్లో చర్చిస్తున్న అంశం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కుప్పకూలిపోవుతున్నది అని. కానీ అది ఎప్పుడు? ఎప్పుడయినా కావొచ్చు.
పిల్లలకు అక్షరం ముక్క రాకపోయినా టీచర్ ల పై ప్రభుత్వం పెడుతున్న ఖర్చు కూడా చెబితే బాగుండు
ReplyDeleteMundu whatsapp group full ayindi chudu
ReplyDelete