Amazon Jobs: మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా.. అయితే వర్క్ ఫ్రం హోం ట్రై చేయండి..
అమెజాన్ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది.
పలు వర్క్ ఫ్రం హోం (Work From Home) ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించింది. సెల్లర్ సపోర్టు అసోసియేట్ (Seller Support Associate) పోస్టులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి ఏదైన డిగ్రీ చేసి ఉంటే చాలు. పూర్తి వివరాలకు అధికారి వెబ్ సైట్ https://www.amazon.jobs/en సందర్శించవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం పూర్తిగా ఆన్లైన్ (Online) ద్వారా నిర్వహిస్తారు. ఎంపిక అనంతరం ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగికి వర్క్ ఫ్రం హోం అవకాశం ఇస్తోంది అమెజాన్ (Amazon). ప్రస్తుతం భర్తీ చేయనున్న సెల్లర్ సపోర్టు అసోసియేట్ ఉద్యోగాల దరఖాస్తు చేసుకోవాలను కొంటున్న అభ్యర్థులు ఈ వివరాలు తెలుసుకోండి.
ముఖ్య సమాచారం..
పోస్టు పేరు సెల్లర్ సపోర్టు అసోసియేట్ (Seller Support Associate)
జీతం సీటీసీ - సంవత్సరానికి రూ. 2,75,000 నుంచి రూ.4,00,000
విద్యార్హత ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి
అప్లికేషన్ లింక్ https://amazonvirtualhiring.hirepro.in
జాబ్ స్కిల్స్.. పని విధానం
- ఇంగ్లీష్ లో మంచి భాషా నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ (Commnication Skills) ఉండాలి.
- 24/7 షిఫ్ట్ లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి.
- వర్క్ ఫ్రం హోంకు అవసరమైన ఇంటర్నెట్ ఫెసిలిటీ బాధ్యత ఉద్యోగిదే.
- వారానికి 5 పని దినాలు, రెండు రోజులు సెలవులు (Hollydays)
- ఇంటర్నెట్, బ్రౌజర్లను సమర్థవంతంగా వినియోగించుకొనే సామర్థ్యం ఉండాలి.
- ఉద్యోగి హైదరాబాద్ లో సంస్థకు అందుబాటులో ఉండాలి.
దరఖాస్తు విధానం.. ఎంపిక ప్రక్రియ
Step 1 : ముందుగా అభ్యర్థి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. (అప్లికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 2 : అనంతరం మీ పూర్తి వివరాలను అందించాలి.
Step 3 : మీరు దరఖాస్తు చేసుకొన్నట్టు ధ్రువీకరిస్తూ మెయిల్ వస్తుంది.
Step 4 : అనంతరం మీ దరఖాస్తును పరిశీలించి ఆన్లైన్ పరీక్షకు ఆహ్వానిస్తూ మెయిల్ వస్తుంది.
Step 5 : మెయిల్ వచ్చిన అభ్యర్థికి ఆన్ లైన్ లో పరీక్ష నిర్వహిస్తారు.
Step 6 : అభ్యర్థి కచ్చింతా మంచి ఇంటర్నెట్ సదుపాయం కలిగి ఉండాలి.
Step 7 : మీ ఇంగ్లీష్ సామర్థ్యంపై ఎక్కువగా ప్రశ్నలు అడుతారు.
Step 8 : రెండు లేదా మూడు రౌండ్లు పరీక్ష నిర్వహిస్తారు.
Step 9 : ఎంపికైన అభ్యర్థిని ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు.
0 Comments:
Post a Comment