🔳బోధన భారం
ఈనాడు-అమరావతి
‘ప్రాథమిక పాఠశాల కన్నా హైస్కూలు బాగుందనే భావన విద్యార్థిలో కలగాలి. అప్పుడే వారు నిరంతరం పాఠశాలకు వస్తారు.3, 4, 5 తరగతులకు స్కూల్ అసిస్టెంట్లతోనే బోధన చేయించాలి’ ఇవీ! జిల్లా విద్యాశాఖ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలు. ‘ఇప్పటికే పనిభారంతో సతమతమవుతున్నాం. చిన్నారులకు కూడా మాతోనే చెప్పించాలని భావించటం యంత్రాంగానికి తగదు’ అని స్కూల్ అసిస్టెంట్లు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం విలీన స్కూళ్లకు పిల్లలు అయితే వచ్చారు. పిల్లలతో పాటు ఎక్కడైనా ఎక్కువగా ఉంటే ఒకరిద్దరు సెకండరీగ్రేడ్ టీచర్లను పంపటం తప్పిస్తే స్కూల్ అసిస్టెంట్లను మాత్రం ప్రత్యేకంగా ఇవ్వలేదు. అలాంటప్పుడు ఆ చిన్న క్లాసులకు సబ్జెక్టు టీచర్లు వెళ్లి బోధించటం సాధ్యమేనా అని ప్రధానోపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఉన్నత పాఠశాల ఆవరణలోనే 70 ప్రాథమిక బడులు ఉన్నాయి. మరికొన్ని ఉన్నత పాఠశాలకు 100, 200 మీటర్ల దూరంలో ఉన్నవి కూడా ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ఇలాంటివి జిల్లాలో 201 ఉన్నాయి.
ఇలాగైతే రోజుంతా బోధనే!
ఇప్పటికే ఉన్నత పాఠశాలల్లో సరిపడా టీచర్లు లేక ఒక్కో ఉపాధ్యాయుడిపై పనిభారం బాగా పెరిగి కనీసం విశ్రాంతి తీసుకోవటానికి వీల్లేకుండా ఉంది. వారానికి 48 పీరియడ్లు ఉంటాయి. సబ్జెక్టు టీచర్లకు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి చొప్పున లీజర్ పీరియడ్ ఉండేలా టైంటేబుల్ రూపొందించాలి. లీజర్ సమయంలో సంబంధిత ఉపాధ్యాయులు ఆయా పాఠ్యాంశాలు చదువుతారు. ఇలా సన్నద్దమై(ప్రిపరేషన్) బోధిస్తే మంచి ఫలితాలు ఉంటాయని భావించే సగటున స్కూల్ అసిస్టెంట్లకు వారానికి గరిష్ఠంగా 33 నుంచి పీరియడ్లు వచ్చేలా టైంటేబుల్ రూపొందిస్తారు. ఇలా చూసినా రోజుకు 5 పీరియడ్లు తప్పనిసరిగా బోధించాల్సిందే.
హైస్కూల్‌లో రోజుకు ఏడు పీరియడ్లు ఉంటాయి. అంటే ఉదయం, సాయంత్రం వేళల్లో గంటన్నర పాటు వారికి లీజర్ పీరియడ్ ప్రస్తుతం దొరుకుతోంది. ఇకపై ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. ప్రాథమిక విద్యార్థులకు చదువు చెప్పాలంటే కనీసం ప్రతి ఉన్నత పాఠశాలకు అదనంగా నలుగురు ఉపాధ్యాయులను ఇవ్వాలని ప్రధానోపాధ్యాయుల సంఘం డిమాండు చేస్తోంది.
0 Comments:
Post a Comment