✍28న ఏపీ జేఏసీ కార్యవర్గ సమావేశం
♦పెండింగ్ సమస్యల సాధనకు కార్యాచరణ రూపకల్పన
🌻అమరావతి, ఆంధ్రప్రభ:
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి(ఏపీ జేఏసీ) రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల 28న నిర్వ హిస్తున్నట్లు జేఏసీ సెక్రటరీ జనరల్ జి. హృదయరాజు తెలిపారు. మంగళవారం ఒక ప్రకటనలో విజయవాడలోని ఏపీ ఎన్జీవో భవన్, మూడో అంతస్తు కాన్ఫరెన్స్ హాల్లో జేఏసీ రాష్ట్ర చైర్మన్ బండి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగే సమావేశంలో అనేక సమస్యలపై చర్చిస్తామన్నారు. నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న 11వ పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, పెండింగ్, ఫ్రీజింగ్ లో ఉన్న డీఏల మంజూరు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపు, హెల్త్ కార్డ్స్ అమలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఎఫ్- ఏపీ జీఎలస్ఐ లోన్స్, క్లైమ్స్ సకాలంలో చెల్లిం పులు తదితర సమస్యలపై ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యంపై చర్చలు జరిపి ఆందొ ళన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని తెలిపారు. సమావేశానికి ఏపీ జేఏసీలోని 104 ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొనాలని కోరారు.
0 Comments:
Post a Comment