✍డీఎస్సీ-2018 తెలుగు ఉపాధ్యాయులు పోస్టింగ్ ఆర్డర్ల నిలిపివేత
🌻ఈనాడు, అమరావతి: న్యాయస్థానంలో రివ్యూ పిటి షన్ పెండింగ్లో ఉండడంతో డీఎస్సీ -2018 తెలుగు పండిత్, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకుండా నిలిపివేశారు. తెలుగు ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఎం.ఎ. తెలుగు, బీఏ తెలుగు వారి అర్హతలపై వివాదం ఏర్పడింది. బీఏ తెలుగు వారితోపాటు ఎం.ఎ. తెలుగు వారికి అర్హత కల్పిస్తూ. హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కౌన్సెలింగ్ చేప ట్టారు. తెలుగు పండిత్, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ద్రువపత్రాల పరిశీలన పూర్తి చేశారు. పోస్టింగ్ లకు అభ్యర్థుల నుంచి ఐచ్ఛికాలూ తీసుకున్నారు. ఈలోపు న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్ పెండింగ్లో ఉన్న విషయం తెలుసుకుని, పోస్టింగ్లు ఇవ్వకుండా వాయిదా వేశారు. న్యాయ వివాదాల కారణంగా మూడే ళ్లుగా ఈ పోస్టులు భర్తీకి నోచుకోలేదు.
0 Comments:
Post a Comment