✍13 వరకు ఇంటర్ పరీక్షల ఫీజు గడువు
🌻అమరావతి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి):
ఇంటర్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు డిసెంబరు 13వ తేదీ వరకు గడువు ఇచ్చారు. మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులంతా మార్చి 2022లో పరీక్ష రాసేందుకు అపరాధ రుసుం లేకుండా డిసెంబరు 13 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఆ తర్వాత రూ.120 అపరాధ రుసుముతో 23 వరకు, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబరు 30 వరకు, రూ.వెయ్యి అపరాధ రుసుముతో జనవరి 4 వరకు, రూ.5000 అపరాధ రుసుంతో జనవరి 20 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశముంది. సాధారణ ఇంటర్ గ్రూప్‌లకు మొదటి ఏడాది పరీక్ష ఫీజు రూ.500, వొకేషనల్ కోర్సులకు రూ.700. బ్రిడ్జికోర్సు సబ్జెక్టులకు రూ.145, మ్యాథ్స్ బ్రిడ్జి కోర్సుకు రూ.200, వొకేషనల్ బ్యాక్‌లాగ్ ప్రాక్టికల్ పరీక్షలకు రూ.200 ఫీజుగా నిర్ణయించారు. ద్వితీయ సంవత్సరం ఫీజులను కూడా పేర్కొంటూ.. ఇంటర్ బోర్డు కమిషనర్ ఎం.వి.శేషగిరిబాబు మంగళ వారం మెమో జారీచేశారు.
0 Comments:
Post a Comment