ఫేస్బుక్ యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ (WhatsApp) ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది.
వాట్సాప్ డేటా (WhatsApp Data) భద్రతపై ఇటీవల పలు విమర్శలు వచ్చినప్పటికీ.. అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లలో ఇది ఒకటిగా కొనసాగుతోంది. దీనిలోని అడ్వాన్స్డ్ ఫీచర్లే (WhatsApp Features) ఇంతటి ఆదరణకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. యూజర్లు చేజారకుండా, కొత్త యూజర్లను ఆకట్టుకునేలా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తోంది వాట్సాప్.
ఇదే తరహాలో ఇప్పుడు ఓ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. అదే 'సెల్ఫ్-చాట్' ఫీచర్. ఈ ఫీచర్ అచ్చం నోట్పాడ్లా పనిచేస్తుంది. అంటే, మీ నెలవారీ బిల్లింగ్‌లు, చేయాల్సిన పనులు, షాపింగ్ జాబితా, ఇంపార్టెంట్ డేట్స్, మీటింగ్స్ ఇలా ప్రతిదీ నోట్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఫైల్‌లు, ఫోటోలను కూడా ఇలా సేవ్ చేసుకోవచ్చు. మొబైల్‌లో కీలకమైన డాక్యుమెంట్లను పదే పదే సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా త్వరగా యాక్సెస్ చేయడానికి కూడా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
వాట్సాప్ సెల్ఫ్ చాట్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
మీ డెస్క్‌టాప్ లేదా మొబైల్‌లో ఏదైనా బ్రౌజర్‌ని ఓపెన్ చేయండి. అడ్రస్ బార్లో దేశం కోడ్ (భారతదేశంలో 91), మీ 10 -అంకెల మొబైల్ నంబర్ తర్వాత wa.me// అని టైప్ చేయండి. ఆ తర్వాత ఎంటర్పై క్లిక్ చేయండి. మీరు డెస్క్‌టాప్ వెర్షన్ ను ఉపయోగిస్తుంటే, వాట్సాప్‌ను ఓపెన్ చేయమని అడిగే ప్రాంప్ట్ విండో కనిపిస్తుంది. తర్వాత 'కంటిన్యూ టు చాట్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. డౌన్లోడ్ వాట్సాప్ లేదా వాట్సాప్ వెబ్ అనే రెండు ఆప్షన్లతో కూడిన కొత్త విండో ఓపెన్ అవుతుంది.
ఒకవేళ మీ ల్యాప్‌టాప్‌లో వాట్సాప్ యాప్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. లేదా వాట్సాప్ వెబ్‌ను ఎంచుకోండి. ఆ తర్వాత సెల్ఫ్ చాట్ ఫీచర్‌ను ప్రారంభించవచ్చు. తద్వారా మీతో మీరే చాట్ చేసుకోవచ్చు. మొబైల్ యూజర్ల విషయంలో వాట్సాప్ చాట్ ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది. పైన మొబైల్ నంబర్, ప్రొఫైల్ పిక్చర్ డిస్ ప్లే అవుతాయి.
ఇక వాట్సప్ ఇటీవల కొన్ని ఫీచర్స్ రిలీజ్ చేసింది. గ్రూప్ కాల్స్ మిస్ అయినవారికి జాయినబుల్ కాల్స్ ఫీచర్ పరిచయం చేసింది. గ్రూప్ కాల్స్ మిస్ అయినవారు కేవలం ఒక్క క్లిక్‌తో ఆ గ్రూప్ కాల్‌లో చేరొచ్చు. గతంలో ఈ అవకాశం ఉండేది కాదు. దీంతోపాటు గూగుల్ డ్రైవ్‌లో, ఐక్లౌడ్‌లో బ్యాకప్స్‌కి ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను జోడించింది. డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్‌లో యూజర్లకు 24 గంటలు, ఏడు రోజులు, 90 రోజుల ఆప్షన్ ఎంచుకునే అవకాశం కల్పించనుంది. వాట్సప్‌లో ఎమోజీ రియాక్షన్స్ ఫీచర్ కూడా రాబోతోంది.
0 Comments:
Post a Comment