Weight loss ఆకుకూరలు తింటే బరువు తగ్గుతారా? బరువు తగ్గడానికి ఎలాంటి ఆహారం బెటర్?
అధిక బరువు (heavy weight). మనిషికి మన: శాంతిని దూరం చేస్తుంది. వేళకు తినకపోవడం, సమయానికి నిద్ర పోకపోవడం తదితర కారణాలు బరువు పెరగడానికి (weight gain) కారణాలవుతాయి.
అయితే ఈ అధిక బరువు శారీరక రోగాలకు దారి తీస్తాయి. అందుకే తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ, కొంతమందికి ఆ సమయం (time) కూడా ఉండదు. బరువు తగ్గడానికి (weight loss) కడుపు కాల్చుకుంటారు. ఆహారం (food) ఎక్కువగా తీసుకోరు. అయినా కూడా అలాంటి వారు బరువు తగ్గరు. వారికీ కూడా ఎందుకో అర్థం కాదు. అయితే అలాంటి వారు కొన్నిచిట్కాలు (tips) పాటిస్తే బరువు (weight) తగ్గుతారు. అతిగా వ్యాయామాలు చేయడమే. ఎంత చక్కటి వర్కవుటైనా... ఇన్నిసార్లు... ఇంతసేపు చేయాలనే నియమం ఉంటుంది. అలా కాకుండా త్వరగా బరువు తగ్గాలని మితి మీరి వర్కవుట్లు చేస్తే అనారోగ్యాల బారిన పడతారు. కాబట్టి క్రమపద్ధతిలో చేయాలి. మధ్య మధ్యలో విరామాలూ తప్పనిసరి.
చెడు ఎల్‌డిఎల్-కొలెస్ట్రాల్..
చాలా మంది అధిక బరువు వల్ల అస్సలు అందం (beautiful)గా కనపడరు. ఇక బరువు పెరగకుండా నాజూకు (slim)గా అందంగా ఉండటానికి ఇవి తప్పకుండా తినండి. అధిక బరువు పెరగడం వల్ల కొందరిలో చెడు ఎల్‌డిఎల్-కొలెస్ట్రాల్ (cholesterol) స్థాయిలు పెరిగిపోతుంది. ఇక మీరు బరువు తగ్గాలంటే (weight loss) గుడ్లు ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటి. వాటిలో ప్రోటీన్ ఇంకా కొవ్వు (cholesterol) అధికంగా ఉంటాయి. అలాగే అవి మిమ్మల్ని ఎక్కువ సేపు ఆకలిగా ఉండటం వలన కడుపు నిండు (stomach full)గా ఉంటుంది.
బ్రోకలీ (broccoli), కాలీఫ్లవర్ (cauliflower), క్యాబేజీ (cabbage) ఇంకా బ్రస్సెల్స్ మొలకలు చెడు కొవ్వుని తగ్గించి బరువు అధిక బరువు (heavy weight) పెరగకుండా ఆపడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వాటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాలే, పాలకూర, కొల్లార్డ్స్, స్విస్ చార్డ్స్ ఇంకా మరికొన్ని ఆకు కూరలు (greens) చెడు కొవ్వుని తగ్గించడానికి ఉపయోగపడతాయి. అవి తక్కువ కేలరీలు ఇంకా కార్బోహైడ్రేట్ కంటెంట్‌తో పాటు అధిక ఫైబర్ (heavy fiber) కంటెంట్‌తో సహా బరువు తగ్గించే ఆహారానికి అనువైన వివిధ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది ఆకుకూరలు కేలరీలు జోడించకుండా మీ భోజనం పరిమాణాన్ని పెంచడానికి ఒక అద్భుతమైన పద్ధతి.
0 Comments:
Post a Comment