Thyroid Problems: థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఈ ఆహార పదార్ధాలు ఎక్కువ తీసుకోవాలి..ఎందుకంటే..
Thyroid Problems: థైరాయిడ్ మన శరీరంలోని అతి ముఖ్యమైన గ్రంధులలో ఒకటి. థైరాయిడ్ గ్రంధి ద్వారా ఉత్పత్తి చేయబడిన హార్మోన్లు ట్రైయోడోథైరోనిన్ (T3) మరియు థైరాక్సిన్ (T4) శారీరక శ్రమకు చాలా ముఖ్యమైనవి.
థైరాయిడ్ గ్రంధి మనం తినే ఆహారం నుండి అయోడిన్ సహాయంతో పనిచేస్తుంది. కాబట్టి అయోడిన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోవడం ముఖ్యం.
థైరాయిడ్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో సర్వసాధారణం. బ్రిటిష్ థైరాయిడ్ ఫౌండేషన్ ప్రచురించిన నివేదిక ప్రకారం, ఇది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే, థైరాయిడ్ వ్యాధి పురుషులు, కౌమారదశలో ఉన్నవారు, పిల్లలలో కూడా కనిపిస్తుంది. మీకు థైరాయిడ్ సమస్యలు ఉంటే, హెల్త్‌కేర్ నిపుణుల సలహాతో సరైన చికిత్స పొందండి.
కొన్ని ఆహారాలు థైరాయిడ్ వ్యాధిని కొంతవరకు నివారించడంలో సహాయపడతాయి. అవి ఏమిటో చూద్దాం.
1. గుడ్లు
అయోడిన్ గొప్ప వనరులలో గుడ్లు ఒకటి. థైరాక్సిన్ ఉత్పత్తికి సహాయపడటానికి గుడ్లు ప్రధాన కారణాలలో ఒకటి అని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
2. నట్స్
థైరాయిడ్ వ్యాధికి ప్రధానమైన ఆహారాలలో నట్స్ ఒకటి. గింజల్లో ఉండే సెలీనియం కొంత వరకు థైరాయిడ్ వ్యాధితో పోరాడటానికి సహాయపడుతుంది.
3. గింజలు ధాన్యాలు
ప్రోటీన్ స్టోర్హౌస్ అయిన గింజలు మరియు ధాన్యాలు, థైరాయిడ్ హార్మోన్లు శరీరంలోని అన్ని కణాలను చేరుకోవడానికి సహాయపడతాయి. ఇది థైరాయిడ్ గ్రంధి సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది.
4. నెయ్యి- వెన్న
హార్మోన్ల ఉత్పత్తి,నియంత్రణపై కొవ్వు ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నెయ్యి, వెన్నని తగినంతగా తీసుకోవడం వల్ల హార్మోన్ ఉత్పత్తిలో హెచ్చుతగ్గులను నియంత్రించవచ్చు. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం వివిధ అధ్యయనాల రచనల నుంచి సేకరించినది. ఆరోగ్యం-ఆహారం వివిధ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఆహారంలో ఏదైనా మార్పులు చేసుకునే ముందు మీ వైద్యుల సలహా తీసుకోవలసినదిగా సూచిస్తున్నాము.
0 Comments:
Post a Comment