Telugu News: ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నోటిఫికేషన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ప్రవేశాలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాకు వెల్లడించారు. ఈ నెల 25 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు, ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుంచి 31 వరకు అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. నవంబరు 1 నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్, ఫార్మసీ వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఆప్షన్ల మార్పునకు నవంబరు 6న అవకాశం కల్పించామన్నారు. ఈఏపీసెట్ ర్యాంక్ కార్డు, ఈఏపీసెట్ హాల్‌టికెట్, ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ మార్కుల మోమో, స్టడీ సర్టిఫికెట్, టీసీ, ఆదాయ ధ్రువీకరణ పత్రం (01-01-2018 తర్వాత జారీ చేసినది), కుల ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ప్రవేశాలకు సంబంధించిన ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు. పూర్తిగా ఆన్‌లైన్ ప్రవేశాల ప్రక్రియ చేపట్టామని.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా ఆన్‌లైన్‌లోనే జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.
0 Comments:
Post a Comment