Telangana: విద్యుత్ సంక్షోభం దేశాన్ని ముప్ప తిప్పలు పెడుతోంది.
బొగ్గు కొరతతో కరెంటు కోతలు తప్పకపోవచ్చని తెలుస్తోంది. కానీ కొన్ని స్టేట్లు మాత్రం విద్యుత్ ను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాయి. కేంద్రం ఆదేశాలు పాటించకుండా దొంగ చాటుగా కరెంటును అమ్ముకుంటూ ధనార్జనే ధ్యేయంగా ముందుకు పోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు కూడా తన విద్యుత్ ను అమ్ముకుంటోందని తెలుస్తోంది. ఈ విషయంలో తెలంగాణను ఢీకొనే రాష్ర్టమే లేదనిపిస్తోంది. విద్యుత్ సంక్షోభం లేకపోవడంతో కరెంటు అమ్ముకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్రం కూడా తెలంగాణ విషయాన్ని ప్రత్యేకంగా తీసుకుంటోంది.
విద్యుత్ కోతలు విధించి మరీ కొన్ని స్టేట్లు మిగులు విద్యుత్ ను ఇతర ప్రాంతాలకు అమ్ముకుంటున్నాయి. అసలే విద్యుత్ సమస్య జఠిలమవుతున్న తరుణంలో పలు స్టేట్లు ఇలా చేయడంపై కేంద్రం సీరియస్ అవుతోంది. తెలంగాణ ప్రభుత్వం రెండు రోజుల్లో 49 మిలియన్ యూనిట్లు అమ్మేసినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో కేంద్రం తెలంగాణ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.
బొగ్గు కొరతతో విద్యుత్ సమస్య ఏర్పడుతోంది. బొగ్గు నిక్షేపాలు తగ్గిపోవడంతో ఈ ముప్పు ఏర్పడుతోంది. మరో వైపు అంతర్జాతీయంగా బొగ్గు వినియోగం భారీగా పెరిగింది. దీంతో విద్యుత్ సంక్షోభం ముదురుతోంది. తెలంగాణలో బొగ్గు గనులు నిక్షేపంగా ఉండటంతో కరెంటు ఉత్పత్తికి ఢోకా లేకుండా పోతోందని తెలుస్తోంది. కానీ తెలంగాణ విద్యుత్ అమ్ముకోవడం కేంద్రాన్ని బాధిస్తోంది.
మిగులు విద్యుత్ ను స్టేట్లు అమ్ముకోవద్దని కొరత ఉన్న ప్రాంతాలకు పంపిణీ చేయాలని ఆదేశించినా పట్టించుకోకపోవడంతో కేంద్రం ఆగ్రహం చెందుతోంది. స్టేట్లు అలా విద్యుత్ ను అమ్ముకుంటే భవిష్యత్ లో తమ వద్ద ఉన్న విద్యుత్ ను వాటికి ఇవ్వమని కేంద్రం హెచ్చరిస్తోంది. తెలంగాణ విద్యుత్ ను విక్రయించడం మానుకోకపోతే భవిష్యత్ లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెబుతోంది.
0 Comments:
Post a Comment