TCS Openings : ఫ్రెషర్స్‌కు టీసీఎస్ గుడ్‌న్యూస్.. 77 వేల మంది నియామకానికి సన్నాహాలు
భారత అతిపెద్ద ఐటీ సర్వీసెస్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TATA Consultancy Services) ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది.
టెక్ టాలెంట్‌కు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా 2022 ఆర్థిక సంవత్సరంలో 77,000 మంది ఫ్రెషర్‌లను నియమించుకోనున్నామని కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. ''క్యాంపస్ నియామకాల్లో భాగంగా మేము ఇప్పటికే 43,000 మంది ఫ్రెషర్స్‌ను రిక్రూట్మెంట్ (Recruitment) ను ప్రారంభించాం. ఈ ప్రక్రియ పూర్తవ్వగానే మరో 34,000 మందిని నియమించుకోనున్నాం. ఇలా మొత్తం 77,000 మంది ఫ్రెషర్స్‌కు రికార్డు స్థాయిలో అవకాశాలు కల్పిస్తున్నాం. రాబోయే కాలంలో డిమాండ్ మేరకు మరిన్ని నియామకాలు చేపట్టనున్నాం" అని పేర్కొన్నారు.
ఫ్రెషర్స్ కోసం టీసీఎస్ ఇప్పటికే ఒక డిజిటల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ (Certificate Program) ను నిర్వహిస్తోంది. బీటెక్ ఏడో సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు ఎక్స్‌ప్లోర్ ప్రోగ్రామ్ ద్వారా టెక్నాలజీ (Technology), సాఫ్ట్ స్కిల్స్ (Soft Skills) పై ట్రైనింగ్ ఇస్తోంది. క్లౌడ్ కంప్యూటింగ్ లేదా సైబర్ సెక్యూరిటీపై వారికి అవగాహన కల్పిస్తోంది.
ప్రతి వారం 1,500 మంది విద్యార్థులకు టీసీఎస్ (TCS) డిజిటల్ సర్టిఫికేషన్ (Digital Certification) ప్రోగ్రామ్ ద్వారా శిక్షణ ఇస్తోంది. ఈ కోర్సు పూర్తయిన తర్వాత, అభ్యర్థుల సామర్థ్యం ఆధారంగా అనేక ప్రోత్సాహకాలను కూడా అందజేస్తుంది. గతేడాది టీసీఎస్ ఏడాదికి రెండుసార్లు జీతాల పెంపును ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఫ్రెషర్స్ ప్రారంభ వేతనం (Starting Salary) దాదాపు రూ .3.5 LPA వద్ద ఉంది. దీన్ని భారీగా పెంచే అవకాశాలున్నాయిని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఫ్రెషర్స్‌కు డిజిటల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్..
టీసీఎస్ రెండో త్రైమాసికంలో 19,690 మంది ఉద్యోగుల (Employees) ను నియమించుకుంది. దీంతో సెప్టెంబర్ 30 నాటికి టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,28,748 కి చేరుకుంది. ఈ మొత్తం సంఖ్యలో 36.2 శాతం మహిళా ఉద్యోగులు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. టీసీఎస్ అట్రిషన్ రేటు సెప్టెంబర్ త్రైమాసికంలో 11.9 శాతానికి పెరిగింది. ఇది గత త్రైమాసికంలో 8.6 శాతంగా ఉంది. మరోవైపు, కంపెనీలో ఇప్పటివరకు 70 శాతం మంది ఉద్యోగులు పూర్తిగా వ్యాక్సిన్ (Vaccine) వేసుకున్నారని టీసీఎస్ తెలిపింది.
ఉద్యోగులెవరూ ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడకుండా పలు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) విధానంలో ప్రస్తుతం 98 శాతం మంది పనిచేస్తున్నారని, క్రమంగా వారందరినీ ఆఫీసులకు రప్పించాలని భావిస్తున్నట్లు పేర్కొంది.
0 Comments:
Post a Comment