RGUKT Call Letters
✍ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు కౌన్సెలింగ్
*🌻అమరావతి, ఆంధ్రప్రభ:* రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీ(ఆర్జీయూకేటీ)ల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ తేదీలు ప్రకటించారు. నవంబర్ 22 నుంచి 30వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన, సీట్ల కేటాయింపు చేయనున్నట్లు ఆర్జీయూకేటీ ఛాన్సలర్ కేసీ రెడ్డి, వైస్-ఛాన్సలర్ కే.హేమచంద్రా రెడ్డి, ప్రవేశాల కన్వీనర్ ఎస్ఎస్ఎస్పీ గోపాలరాజు తెలిపారు. అంతకు ముందు ప్రత్యేక సీట్ల కేటాయింపు నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రవేశ కౌన్సిలింగ్ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్సలో ఉంటుందని వారు తెలిపారు. విద్యార్థులు తమ వెసులుబాటును బట్టి నూజివీడు, ఆర్కే వ్యాలీ (ఇడుపులపాయ) క్యాంపస్లో ఎక్కడైనా హాజరు కావొచ్చని వారు పేర్కొన్నారు. నవంబర్ 22న 400 ర్యాంక్ వరకు ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల పరిధి, నాన్ లోకల్ అన్ని కేటగిరీలకు ప్రవేశాల కౌన్సిలింగ్ ఉంటుంది. 23న 1200 ర్యాంకు వరకు, 24న 2వేల ర్యాంకు వరకు, 25న 3వేల ర్యాంకు వరకు, 26న 4వేల ర్యాంకు వరకు, 27న 5వేల ర్యాంకు వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. 28న శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని ఓసీ కేటగిరీ 5001 నుంచి 6వేల ర్యాంకు వరకు, రెండు యూనివర్సీ పరిధి, నాన్ లోకల్ అన్ని కేటగిరీల్లో 6వేల ర్యాంకు వరకు కౌన్సిలింగ్ ఉంటుంది. 29న ఎస్సీ కేటగిరీలో 6001 నుంచి 10వేల ర్యాంకు, ఆంధ్రా, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలోని ఈడబ్ల్యుఎస్ కేటగిరీలో 6001 నుంచి ఏడు వేల ర్యాంకు వరకు, బీసీ సీ కేటగిరీలో రెండు విశ్వవిద్యాలయాలు, నాన్ లోకల్ విద్యార్థులకు 6001 నుంచి 21 వేల ర్యాంకు వరకు, బీసీ ఈ కేటగిరీలో 6001 నుంచి 11వేల ర్యాంకు వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. 30న ఎస్సీ కేటగిరీలో 10,001 నుంచి 14వేల ర్యాంకు వరకు, ఎస్టీ కేటగిరీలో 6001 నుంచి 21 వేల వరకు, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలోని ఎస్టీ కేటగిరీలో 21వేల నుంచి 25 వేల ర్యాంకు వరకు కౌన్సిలింగ్ ఉంటుంది.
♦స్పెషల్ కేటగిరీ..
నూజివీడు ట్రిపుల్ ఐటీలో నవంబర్ 10, 11 తేదీల్లో క్యాప్, 8 నుంచి 11వ తేదీ వరకు క్రీడలు, 10న దివ్యాంగులు, 8 నుంచి 12 వరకు ఎన్సీసీ అభ్యర్థులకు ప్రవేశ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఆయా కేటగిరీల సర్టిఫికెట్లు కౌన్సిలింగ్ సమయంలో విధిగా తీసుకురావాలని పేర్కొంటూ పూర్తి వివరాల కోసం ఆర్జేయూకేటీ వెబ్సైటు పరిశీలించాలని వారు తెలిపారు.
RGUKT CET-21 was held on 26-09-2021 at 467 centres in Andhra Pradesh and 8 centres in Telangana and a total of 70,131 candidates appeared for the examination. Results were declared by Hon'ble Minister for Education on 6t October, 2021.
Admission counselling for 4400 seats including 10% EWS supernumerary seats and for 5% NRI (candidates studied outside AP and Telangana) and global seats will be held in the month of November 2021. NRI and Global candidates need to submit their application during the counselling dates and seats will be filled as per the merit of the candidates in the
10t class or equivalent examination held in 2021. Certificate verification for Special category candidates (NCC, Sports, CAP and PH) will be held at Nuzvid campus from 8 to
12\ November, 2021. The detailed schedule is given below.
0 Comments:
Post a Comment