Railway Jobs: రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES) కాంట్రాక్టు ప్రాతిపదికన ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో(Railway Jobs) మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులు ఒక సంవత్సరం పాటు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కంపెనీ అవసరాలు, ప్రాజెక్ట్ వ్యవధి, ఉద్యోగి పనితీరును బట్టి కాంట్రాక్టు వ్యవధి పొడిగిస్తారు. అయితే ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదు. కేవలం పదవీ విరమణ చేసిన ఉద్యోగులు మాత్రమే అర్హులు. ఎంపికైన వారికి వారి అర్హతలు, అనుభవం ఆధారంగా రూ .1,54,000 వరకు వేతనం లభిస్తుంది. (Railway Jobs)
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
RITES రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 ఖాళీలు భర్తీ చేస్తారు. వాటిలో 10 చీఫ్ రెసిడెంట్ ఇంజనీర్, 10 అసిస్టెంట్ రెసిడెంట్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. చీఫ్ రెసిడెంట్ ఇంజనీర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్/బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో అభ్యర్థులకు కనీసం 25 సంవత్సరాల అనుభవం ఉండాలి. అందులో కనీసం 6 సంవత్సరాలు చీఫ్ ఇంజినీర్ స్థాయి పోస్టులో పనిచేసి ఉండాలి.
అసిస్టెంట్ రెసిడెంట్ ఇంజనీర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా బీఈ/బీటెక్/బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి. డిప్లొమా హోల్డర్‌లకు సంబంధిత విభాగంలో కనీసం 12 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. అదే డిగ్రీ హోల్డర్ల విషయంలో 6 సంవత్సరాల అనుభవం ఉండాలి. మరో 6 సంవత్సరాలు రైల్వే నిర్మాణ ప్రాజెక్టులలో AEN లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో పోస్టులలో పనిచేసి ఉండాలి.
ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు 2021 నవంబర్ 12లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రైట్స్ వెబ్‌సైట్‌లోని రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేసి దరఖాస్తు ఫారమ్ నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫీజు చెల్లించి దరఖాస్తును సబ్మిట్ చేయాలి.
0 Comments:
Post a Comment