Nihang Sikh : పంజాబ్​లో సంచలనం సృష్టిస్తున్న నిహాంగ్‌ సిక్కులు.. వీరు ఎవరు? ఎందుకు దాడులు చేస్తున్నారు? .. తెలుసుకోండి ~ MANNAMweb.com

Search This Blog

Latest Posts ⚡ లేటెస్ట్ పోస్ట్స్

MORE TO VIEW

Sunday 17 October 2021

Nihang Sikh : పంజాబ్​లో సంచలనం సృష్టిస్తున్న నిహాంగ్‌ సిక్కులు.. వీరు ఎవరు? ఎందుకు దాడులు చేస్తున్నారు? .. తెలుసుకోండి

 నిహాంగ్ సిక్కులు (Nihang Sikh) చేస్తున్న వివాదాస్పదమైన దాడులు భారతదేశమంతటా సంచలనం సృష్టిస్తున్నాయి. ఏడాదిన్నర కిందట లాక్​డౌన్​ సమయంలో ఓ పంజాబ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ కర్ఫ్యూ పాస్ చూపించాలని అడిగితే..

నిహాంగ్ సిక్కులు అతని చేతిని ఘోరంగా నరికేశారు. ఆ ఘటన మరువకముందే నిహాంగ్ సిక్కులు ఓ మర్డర్ (murder) చేసి కలకలం రేపుతున్నారు. శుక్రవారం సింఘు సరిహద్దు (sigha border) వద్ద సాగు చట్టాలకు (agriculture laws) నిరసన చేస్తున్న సమయంలో నిహాంగ్ సిక్కులు ఒక వ్యక్తిని క్రూరంగా హత్య (murder) చేశారు. తమ పవిత్ర గ్రంథాన్ని (Scripture) అగౌరవపరిచడం వల్లే హత్య చేసినట్లు నిహాంగ్ సిక్కుల్లోని ఓ వ్యక్తి ఆరోపించాడు. అగౌరవపరిచిన వారిని అంతమొందించడం తమ బాధ్యత (responsibility) అంటూ మరికొందరు సిక్కులు (sikhs) వైరల్ వీడియోల్లో (video) చెబుతూ కనిపించారు. ఈ క్రమంలో వారు చేసిన గత సంఘటనలు, వారి చరిత్ర, వారి ప్రస్తుత పరిస్థితుల (situation) గురించి తెలుసుకుందాం.

నిహాంగ్‌లు ఎవరు?

నిహాంగ్ (Nihang) అనేది సిక్కు యోధులు వాడే బ్లూ కలర్ వస్త్రాలు (Blue color dress), కత్తులు (knifes), ఈటెలు వంటి పురాతన ఆయుధాలు, ఉక్కు చక్రాలు, తలపాగాల (Tiara)ను సూచించే ఒక పేరు/ఆర్డర్ (order) /విధానం. సిక్కు చరిత్రకారుడు డా.బల్వంత్ సింగ్ ధిల్లాన్ ప్రకారం పర్షియన్ భాషలో నిహాంగ్ అనే పదానికి ఎలిగేటర్, ఖడ్గం, పెన్ అని అర్ధం వస్తుంది. కానీ నిహాంగ్ సిక్కుల లక్షణాలు అనేవి నిశ్శాంక్ (nihshank) అనే సంస్కృత పదం (Sanskrit word) నుండి వచ్చినట్లు అనిపిస్తుందని బల్వంత్ సింగ్ అన్నారు. నిశ్శాంక్ అంటే భయం లేకుండా, పవిత్రంగా, స్వచ్ఛంగా... కోరికలు, సౌకర్యాలపై ఆశ లేకుండా ఉండటమేనని తెలిపారు. 19వ శతాబ్దపు చరిత్రకారుడు రత్తన్ సింగ్ భంగు ప్రకారం.. నిహాంగ్‌లను నొప్పి (pain) లేదా అసౌకర్యం ఏ మాత్రం ప్రభావం చూపవు. వీరు ధ్యానం, తపస్సు, దాతృత్వం చేసే సంపూర్ణమైన యోధులని రత్తన్ సింగ్ వర్ణించారు.

ఆర్డర్ ఎప్పుడు ఏర్పడింది?

1699లో గురు గోవింద్ సింగ్ సృష్టించిన ఖల్సా (Khalsa) లో నిహాంగ్ ఆర్డర్ ని గుర్తించవచ్చని ధిల్లాన్ చెప్పారు. నిహాంగ్ అనే పదం పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్‌లోని ఒక శ్లోకంలో కనిపిస్తుందని.. అది నిర్భయమైన, నిరంకుశమైన వ్యక్తిని సూచిస్తుందని కొన్నారు. కొన్ని మూలాల ప్రకారం గురు గోవింద్ సింగ్ చిన్న కుమారుడైన ఫతే సింగ్ (1699-1705) ఒకప్పుడు బ్లూ చోళ దుస్తులు ధరించి కనిపించినట్లు తెలుస్తుందని ఆయన వివరించారు. ఇది ఖల్సా సైనికులైన నిహాంగ్‌ల దుస్తులను సూచిస్తుందని ధిల్లాన్ చెప్పాడు.

నిహాంగ్‌లు ఇతర సిక్కులు, ఇతర సిక్కు యోధులకు ఎందుకు వ్యతిరేకం?

ది ఈస్ట్ ఇండియా కంపెనీ కల్నల్ జేమ్స్ స్కిన్నర్ (1778-1841) ప్రకారం.. ఖల్సా సిక్కులు రెండు గ్రూపులు (two groups)గా ఏర్పడ్డారు. యుద్ధ సమయంలో గురు గోవింద్ సింగ్ ధరించే నీలిరంగు దుస్తులు ధరించిన వారు.. దుస్తుల రంగు విషయంలో ఎలాంటి ఆంక్షలను పాటించనివారుగా విడిపోయారు. ఈ రెండు గ్రూపుల వారు సైనికుల వృత్తిని అనుసరిస్తారు. మస్కట్రీ చకర్బాజీ కళలో తోటివారు లేకుండా ధైర్యంగా పడాల పోరాడగలరు. కోయిట్ల వాడకంలో వారికి వారే సాటి.

నిహాంగ్‌లు ఖల్సా ప్రవర్తనా నియమావళిలో చాలా కఠినమైన రూల్స్ ఫాలో (rules will follow) అవుతారు. వారు భూ యజమానికి/ పాలకులకు ఎలాంటి విధేయతను ప్రకటించరు. కుంకుమకు బదులుగా వారు తమ పుణ్యక్షేత్రాల పైన నీలం నీషన్ సాహిబ్ (జెండా) ఎగురవేస్తారు. నిహాంగ్‌ (nihang)లు అనూహ్య సంఘటనల కోసం 'ఛర్ది కాలా' (ఎప్పటికీ ఉత్సాహంగా ఉండటం), 'టియర్ బార్ టియర్' (ఎప్పుడూ సంసిద్ధులుగా ఉండండి) అనే నినాదాలను ఉపయోగిస్తారు.

నిహాంగ్‌లు శారదై లేదా శర్బతి డిగ్ (sacrament drink) అనే ప్రసిద్ధ పానీయాన్ని ఎంతో ఇష్టపడతారు. బాదం, ఏలకులు, గసగసాలు, నల్ల మిరియాలు, గులాబీ రేకులు పుచ్చకాయ గింజలు గ్రైండ్ చేసి ఈ పానీయాన్ని తయారు చేస్తారు. శత్రువులతో ఈ పానీయంలో గంజాయి కలిపి తాగుతారు. దీన్ని సుఖనిధాన్ అని పిలుస్తారని డాక్టర్ ధిల్లాన్ చెప్పారు.

సిక్కు చరిత్రలో వారి పాత్ర ఏమిటి?

1710-15 కాలంలో మొఘల్ గవర్నర్లు సిక్కులను చంపారు. అఫ్ఘన్ ఆక్రమణదారు అహ్మద్ షా దురానీ (1748-65) దాడి చేశారు. ఆ కాలంలో మొట్టమొదటి సిక్కు పాలన పతనమయినప్పుడు సిక్కు కమ్యూనిటీ 9sikh community)ని కాపాడడంలో నిహాంగ్స్ కీలక పాత్ర పోషించారు. 1734లో ఖల్సా సైన్యాన్ని ఐదు బెటాలియన్లుగా విభజించినప్పుడు.. నిహాంగ్ లేదా అకాలీ బెటాలియన్ కు బాబా దీప్ సింగ్ షాహిద్ నాయకత్వం వహించారు. నిహాంగ్‌లు అమృత్‌సర్‌లోని అకల్ బుంగా (ఇప్పుడు అకల్ తఖ్త్) వద్ద సిక్కుల మతపరమైన వ్యవహారాలను కూడా నియంత్రించారు. వారు తమను తాము ఏ సిక్కు అధిపతికి బానిసల్లాగా భావించలేదు. వారంతా పూర్తి స్వతంత్రంతో ఉండేవారు.

అకల్ తఖ్త్ వద్ద వారు సిక్కుల గ్రాండ్ కౌన్సిల్ (సర్బత్ ఖల్సా)ను నిర్వహించి తీర్మానాన్ని (గురుమాత) ఆమోదించారు. 1849లో సిక్కు సామ్రాజ్యం పతనం అయింది. తరువాత పంజాబ్ బ్రిటిష్ అధికారులు 1859లో స్వర్ణ దేవాలయ పరిపాలనకు మేనేజర్ (సర్బ్రహ్) ని నియమించారు. అంతటితో సిక్కు సామ్రాజ్యం పూర్తిస్థాయిలో అంతమైపోయింది.

పంజాబ్‌ (Punjab)లో ఇటీవల కాలంలో నిహాంగ్ సిక్కుల వల్ల జరిగిన ఇతర ప్రధాన సంఘటనలు ఏమిటి?

గత ఏడాది ఏప్రిల్‌లో నిహాంగ్ సిక్కుల బృందం పాటియాలాలోని పోలీసులపై దాడి చేసి.. పంజాబ్ పోలీసు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ చేతిని నరికారు. నిహాంగ్‌లు తమ వాహనంతో పోలీసు బారికేడ్‌లోకి దూసుకెళ్లారు. ఆ వాహనం నుంచి పదునైన ఆయుధాలతో దిగి పదునైన పోలీసులను వెంబడించి వారిపై దాడి చేశారు. ఏఎస్ఐ హర్జీత్ సింగ్ తెగిపోయిన తన చేయిని తిరిగి అతికించుకోవడానికి చండీగఢ్‌లోని ఓ ఆసుపత్రిలో ఏడు గంటల సర్జరీ చేయించుకున్నారు. ఈ ఘటన అనంతరం బల్బేరా గ్రామంలోని డేరా కాంప్లెక్స్ లో మహిళతో సహా 11 మంది నిహాంగ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది జూలైలో ఇద్దరు నిహాంగ్ సిక్కులు లుధియానాలో రాజీవ్ గాంధీ విగ్రహానికి (statue) నిప్పు పెట్టారు.

వారి ప్రస్తుత పరిస్థితి ఏంటి?

ప్రస్తుతం నిహాంగ్‌ (nihangs)లు ఒక చిన్న సంఘంగా నివసిస్తున్నారు. దాదాపు ఒక డజను బ్యాండ్‌లు ఒక్కొక్క జతేదార్ నేతృత్వంలో ఇప్పటికీ సంప్రదాయ ఆర్డర్ కొనసాగిస్తున్నాయి. వీటిలో బుధ దళ్, తరుణ దళ్, వారి వర్గాలకు ప్రాముఖ్యత ఉంది. ఏడాది పొడవునా వారు తమ కేంద్రాలు వద్ద ఉంటారు. అయితే వారు ఆనంద్‌పూర్ సాహిబ్, దండమా సాహిబ్ తల్వాండి సాబో, అమృత్‌సర్ వంటి వార్షిక తీర్థయాత్రలకు వెళుతుంటారు. అక్కడ మతపరమైన కార్యక్రమాలలో పాల్గొని యుద్ధ నైపుణ్యాలు, గుర్రపుస్వారీని ప్రదర్శిస్తారు. కాగా ప్రస్తుతం కొనసాగుతున్న వ్యవసాయ నిరసనల్లో నిరసన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు నిహాంగ్‌ల బృందాలు సింఘు వద్దకు వెళ్లాయి.

ఎవరు నిహాంగ్‌గా మారగలరు?

నిహాంగ్ సిక్కు నాయకుడి ప్రకారం.. కులం లేదా మతంతో సంబంధం లేకుండా ఎవరైనా సరే దీంట్లో జాయిన్ కావచ్చు. అయితే వారు కత్తిరించని జుట్టు కలిగి, సిక్కు సంప్రదాయాలను పాటించాలి. ఐదు బాణీల (banish) ను గుర్తుంచుకోవాలి. ఉదయం 1 గంటలకు నిద్రలేచి ప్రతిరోజూ క్షమాభిషేకాలు చేయగలిగాలి. అలాగే ఉదయం సాయంత్రం ప్రార్థనలు చేయగలిగేవారు నిహాంగ్ సిక్కుల వర్గంలో జాయిన్ కావచ్చు. బాబాటిజం (Baptism) పొంది నిహాంగ్‌గా మారడానికి సిద్ధమైన సిక్కులకు ఖల్సా సమయంలో గురు గోవింద్ సింగ్ వాడిన వస్త్రాలు ఆయుధాలు ఇస్తారు.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top