కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన నూతన విద్యావిధానాన్ని (ఎన్‌ఈపీ) తమిళనాడులో అమలు చేయబోమని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు.
రాష్ట్ర విద్యా విధాన రూపకల్పనకు నిపుణుల కమిటీని నియమిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకే 'ఇంటివద్దకే విద్య' కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. తమిళనాడు ప్రభుత్వం 'ఇంటివద్దకే విద్య' కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించింది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టింది. సర్కారు బడుల్లో విద్యార్థులకు వివిధ అంశాల్లో నైపుణ్యాలను పెంచేందుకు ఇప్పటివరకు ఈ కార్యక్రమం కింద 86,550 మంది వలంటీర్లు రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు.
0 Comments:
Post a Comment