NEET 2021 : నీట్ టాప్ 10 కాలేజీలు ఇవే.. వాటి ప్రవేశాలకు కట్ ఆఫ్ వివరాలు తెలుసుకోండి
ప్రతీ ఏటా మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (National Eligibility cum Entrance Test) రాసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.
ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది ఈ పరీక్ష రాసారు. త్వరలో నీట్2021 పరీక్ష ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. ఫలితాల అనంతరం కౌన్సెలింగ్ (Counseling) నిర్వహిస్తారు. ఫలితాలు అక్టోబర్‌లోనే ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనే అంచనాలు వేస్తున్నారు. దేశంలో టాప్ మెడికల్ కాలేజీలు (Medical Colleges) ఏవీ? అందులో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి. 2016 నుంచి ఇప్పటి వరకు ఆ కాలేజీ సీట్ రావడానికి ఎంత ర్యాంక్ అవసరం అయ్యిందో తెలుసుకొందాం.
నీట్ (NEET)లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో అడ్మిసన్ పొందడానికి కనీసం అర్హత మార్కులు రావాలి. ఈ అర్హత మార్కులు ముఖ్యంగా పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్, అత్యధిక మార్కులు, కేటగిరీ వంటి అంశాలు కట్ఆఫ్‌ను ప్రభావితం చేస్తాయి. కళాశాలలు, కోర్సులు మరియు పరీక్షకుల కేటగిరీని బట్టి కట్-ఆఫ్ (Cut Off) మార్కులు మారవచ్చు.
కట్ ఆఫ్ తక్కువగా ఉండే అవకాశం
గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కటాఫ్ తక్కువగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. 2020 లో, టాప్ కాలేజీలకు కట్ ఆఫ్ స్కోర్ 720-147 ఉంది. 2019 లో ఇది 701-134. ఈ సంవత్సరం, రిజర్వ్ చేయని కేటగిరీ విద్యార్థులకు, స్కోరు 715 - 130 వరకు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
ప్రతి సంవత్సరం, అగ్ర వైద్య కళాశాలలు వివిధ వైద్య కార్యక్రమాలకు NEET-UG ప్రవేశానికి వారి ప్రారంభ మరియు ముగింపు ర్యాంకును విడుదల చేస్తాయి. వాటి వివరాలు ఒక సారి చూద్దాం.
మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్, న్యూఢిల్లీ:
సంవత్సరం ముగింపు ర్యాంక్
2020 90
2019 32
2018 58
2017 49
2016 44
VMMC సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, న్యూఢిల్లీ:
సంవత్సరం ముగింపు ర్యాంక్
2020 163
2019 157
2018 107
2017 82
2016 106
మెడికల్ సైన్సెస్ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ:
సంవత్సరం ముగింపు ర్యాంక్
2020 324
2019 171
2018 165
2017 185
2016 128
లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ, న్యూఢిల్లీ:
సంవత్సరం ముగింపు ర్యాంక్
2020 571
2019 489
2018 314
2017 369
2016 263
ప్రభుత్వ వైద్య కళాశాల, చండీగఢ్:
సంవత్సరం ముగింపు ర్యాంక్
2020 776
2019 360
2018 254
2017 278
2016 162
సేథ్ జిఎస్ మెడికల్ కాలేజీ, ముంబై:
సంవత్సరం ముగింపు ర్యాంక్
2020 457
2019 638
2018 296
2017 297
2016 408
కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ, లక్నో:
సంవత్సరం ముగింపు ర్యాంక్
2020 1800
2019 908
2018 703
2017 725
2016 506
స్టాన్లీ మెడికల్ కాలేజ్, చెన్నై:
సంవత్సరం ముగింపు ర్యాంక్
2020 5,253
2019 4,572
2018 3,520
2017 3,848
2016 2,264
PT భగవత్ దయాళ్ శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సైన్సెస్, రోహ్‌తక్:
సంవత్సరం ముగింపు ర్యాంక్
2020 6,573
2019 1,825
2018 1,178
2017 1,481
2016 1,035
గ్రాంట్ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ యొక్క సర్ జెజె గ్రూప్, ముంబై:
సంవత్సరం ముగింపు ర్యాంక్
2020 2,828
2019 1,329
2018 1,122
2017 1,018
2016 408
ఇది గత ఐదు సంవత్సరాలుగా దేశంలోనే టాప్ 10 కాలేజీల్లో చేరేందకు నీట్ పరీక్షలో వచ్చి ర్యాంకుల వివరాలు. వీటి ఆధారంగా ఈ ఏడాది కూడా ఎంత ర్యాంక్ వస్తుందో అంచనా వేసుకోవచ్చు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (DGHS) మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (MCC) తరపున ఆల్ ఇండియా కోటా (AIQ) సీట్లకు NEET కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. మొత్తం, ప్రతి కళాశాలలో 15% సీట్లు AIQ కొరకు అందించబడతాయి, అయితే, మిగిలిన 85% సీట్లు రాష్ట్రం విద్యార్థులకు కేటాయిస్తారు.
0 Comments:
Post a Comment