కోడిగుడ్డు 'చిన్న బోతొంది'
♦మధ్యాహ్న భోజనానికి 35-40 గ్రాములవే సరఫరా
🌻ఈనాడు, అమరావతి:
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు అందిస్తున్న కోడిగుడ్ల పరిమాణం, బరువుపై పర్యవేక్షణ కొరవ డింది. నిబంధనల ప్రకారం 45 గ్రాములు కంటే ఎక్కువ బరువున్న కోడిగుడ్లనే విద్యార్థులకు ఇవ్వాలి. చాలాచోట్ల గుత్తేదారులు తక్కువ ధరకు దొరికే 35-40 గ్రాముల గుడ్లనే సరఫరా చేస్తు న్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 41.60 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజ నులో వారానికి ఐదు కోడిగుడ్లను పాఠశాల విద్యా శాఖ అందిస్తోంది. ఎక్కువ మొత్తంలో సరఫరా. ఉండటంతో చిన్నవాటిని పెద్ద గుడ్లలో కలిపేసి సరఫరా చేస్తున్నారు. కొన్నిచోట్ల ఆచ్చంగా బరువు, సైజు తక్కువగా ఉండే వాటినే అందిస్తున్నారు.
♦ఎక్కువ రోజుల నిల్వతో చెడిపోతున్నా..
రాయలసీమలోని కొన్ని జిల్లాలకు 15 రోజులకు, ఉత్తరాంధ్రలో 10 రోజులకోసారి పాఠశాలలకు కోడి. గుడ్లు సరఫరా చేస్తున్నారు. అప్పటికే గుత్తేదారుల దగ్గర కొన్ని రోజుల నిల్వ ఉండటం, ఆ తర్వాత బడుల్లో రోజుల తరబడి ఉంచాల్సి రావడంతో కుళ్లి పోతున్నాయి. ట్రేల్లో ఉన్నప్పుడు చెడిపోతే గుత్తేదా రుకు చూపించి కొత్తని తీసుకుంటున్నారు. ఉడికిం చేటప్పుడు చెడిపోతే వాటిని బయటపడేస్తున్నారు. వాటికి ప్రభుత్వం ధర చెల్లించాల్సి వస్తోంది. గుడ్లు చెడిపోతే తాము బాధ్యత వహించాల్సి వస్తోందని, అందువల్ల వారానికోసారి సరఫరా చేయాలని ప్రధానోపాధ్యాయులు మొత్తుకుంటున్నా ఉన్నతాది. కారులు పట్టించుకోవడం లేదు.
0 Comments:
Post a Comment