Jobs in Indian Navy SSR&AA .. Apply Online for 2500 Vacancies
ఇండియన్ నేవీలో ఆర్టిఫిషర్ అప్రెంటిస్(ఏఏ) & సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్ఎస్ఆర్) 2500 పోస్టులు – దరఖాస్తు వివరాల
ఇండియన్ నేవీ ఫిబ్రవరి 2022 బ్యాచ్ కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. ఆర్టిఫిషర్ అప్రెంటిస్(ఏఏ)
2. సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్ఎస్ఆర్)
మొత్తం ఖాళీలు: 2500
అర్హత:
1. ఆర్టిఫిషర్ అప్రెంటిస్(ఏఏ): కనీసం 60 శాతం మార్కులతో మాడ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ బయోలజీ/ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత.
2. సీనియర్ సెకండరీ రిక్రూట్స్(ఎస్ఎస్ఆర్): కనీసం 60 శాతం మార్కులతో మాడ్స్, ఫిజిక్స్, కెమిస్టీ! బయోలజీ/ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత
వయసు: 01 ఫిబ్రవరి 2002 నుంచి 31 జనవరి 2005 మధ్య జన్మించి ఉండాలి.
జీతభత్యాలు: శిక్షణా కాలంలో నెలకి రూ.14600 చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నఅభ్యర్థులకి డిఫెన్స్ పే మ్యాట్రిక్స్ ఆధారంగా రూ.21700 - రూ.69100 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
రాత పరీక్ష హిందీ, ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది.
కొవిడ్ 19 కారణంగా కేవలం 10000 మంది అభ్యర్థులని మాత్రమే రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టు పిలుస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల్ని మాత్రమే ఎంపిక చేస్తారు.
కోర్సు ప్రారంభం: ఫిబ్రవరి 2021
శిక్షణ వ్యవధి: ఆర్టిఫిషర్ అప్రెంటిస్(ఏఏ) అభ్యర్థులకు 09 వారాలు, సీనియర్ సెకండరీ రిక్రూట్స్(ఎస్ఎస్ఆర్) అభ్యర్థులకు 22 వారాలు శిక్షణ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల ప్రారంభ తేది: 16.10.2021.
దరఖాస్తులకి చివరి తేది: 25.10.2021.
0 Comments:
Post a Comment