దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ (IT Companies) భారీగా ఉద్యోగావకాశాలు ఇవ్వబోతున్నాయి. వేల సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయబోతున్నాయి. ఇప్పుడిప్పుడే డిగ్రీ పూర్తి చేసినవారికి కావాల్సిన స్కిల్స్ ఉంటే చాలు... ఐటీ కంపెనీలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రెషర్స్‌కి అవకాశం ఇచ్చేందుకు బడాబడా ఐటీ కంపెనీలన్నీ క్యూ కడుతున్నాయి. ఇన్ఫోసిస్ (Infosys), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), విప్రో లిమిటెడ్ (Wipro) లాంటి ఐటీ కంపెనీలు తాము వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి.
కరోనా వైరస్ మహమ్మారి తర్వాత ఐటీ కంపెనీలకు బిజినెస్ పెరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పాటు ఇతర సేవల కోసం రకరకాల సాఫ్ట్‌వేర్లను ఉపయోగించుకుంటున్నాయి సంస్థలు. సాఫ్ట్‌వేర్ సేవల కోసం ఐటీ కంపెనీలపై ఆధారపడుతున్నాయి అనేక సంస్థలు. దీంతో సాఫ్ట్‌వేర్ కంపెనీలకు వ్యాపారం పెరిగింది. ఐటీ కంపెనీల్లో ఉద్యోగులకు డిమాండ్ పెరిగిపోతుండటంతో ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి వెళ్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఈ ఐటీ కంపెనీల్లో ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు టాలెంట్ హంట్ మొదలుపెట్టాయి ఐటీ కంపెనీలు.
ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 45,000 ఫ్రెషర్స్‌ని నియమించుకోనుంది. అంతేకాదు... ఆ తర్వాత సంవత్సరంలో మరో 25,000 మంది ఫ్రెషర్స్‌ని నియమించుకుంటామని ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 35,000 మందిని నియమించుకుంటామని గతంలో ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఈ టార్గెట్‌ను మరింత పెంచుకుంది ఇన్ఫోసిస్. అదనంగా మరో 10,000 మందిని నియమించుకోనుంది. ఉద్యోగుల ఆరోగ్యం, వెల్‌నెస్, రీస్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ పైనా దృష్టిపెట్టామని ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఇన్ఫోసిస్‌లో ప్రస్తుతం 279,617 ఉద్యోగులు ఉన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో 25,000 ఫ్రెషర్స్‌ని నియమించుకుంటామని విప్రో లిమిటెడ్ ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలో 8,150 ఫ్రెషర్స్‌ని వప్రో నియమించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 25,000 ఫ్రెషర్స్‌కి ఉద్యోగావకాశాలు ఇవ్వనుంది. విప్రో లిమిటెడ్‌లో ప్రస్తుతం 221,365 ఉద్యోగులు ఉన్నారు.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ గత ఆరు నెలల్లో 43,000 ఫ్రెషర్స్‌ని నియమించుకుంది. రెండో త్రైమాసికంలో 19,690 ఉద్యోగులు కంపెనీలో చేరారు. మరో 35,000 మంది ఫ్రెషర్స్‌ని మియమించుకోనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 78,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌కి ఉద్యోగావకాశాలు ఇవ్వనుంది టీసీఎస్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో మొత్తం 528,748 ఉద్యోగులు ఉన్నారు.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి ఐటీ కంపెనీలన్నీ క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌తో పాటు నేరుగా ఫ్రెషర్స్‌కి ఉద్యోగావకాశాలు ఇస్తున్నాయి. ఈ కంపెనీల్లో ఉద్యోగాలు కోరుకునే వారంతా ఆయా కంపెనీల అధికారిక వెబ్‌సైట్స్‌లో కెరీర్ సెక్షన్ ఫాలో కావాలి.
0 Comments:
Post a Comment