IBPS Clerk Recruitment 2021: దేశంలోని కోట్ల సంఖ్యలో నిరుద్యోగులు బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. బ్యాంక్ ఉద్యోగాల కొరకు సన్నద్ధమవుతున్న వారికి ఐబీపీఎస్ అదిరిపోయే తీపికబురు అందించింది.
ప్రాంతీయ భాషలలో ఐబీపీఎస్ క్లర్క్ పరీక్షను రాసే అవకాశాన్ని ఈ సంస్థ కల్పిస్తుండటం గమనార్హం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు ఈ పరీక్షను తెలుగులో కూడా రాసే అవకాశం ఉంటుంది. కేంద్రం ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను అమలు చేస్తోంది.
ఐబీపీఎస్ సీఆర్‌పీ క్లర్క్- xi ఉద్యోగ ఖాళీల కొరకు నోటిఫికేషన్ రిలీజ్ కాగా 2021 సంవత్సరం అక్టోబర్ నెల 7వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తం 5830 క్లర్క్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. ప్రాంతీయ భాషలలో పరీక్ష నిర్వహించాలనే డిమాండ్ వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగింది. అయితే తాజా ఉత్తర్వుల వల్ల ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మళ్లీ ప్రారంభమైంది.
నోటిఫికేషన్ రిలీజైన సమయంలో దరఖాస్తు చేసుకున్న వాళ్లు మళ్లీ ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (సీఆర్‌పీ) ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన భర్తీ ప్రక్రియ జరగనుంది. ఏపీలో ఉద్యోగ ఖాళీలు 263 ఉండగా తెలంగాణలో ఉద్యోగ ఖాళీలు 263 ఉన్నాయి. https://www.ibps.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ ఏడాది డిసెంబర్ లో ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతుండగా 2022 జనవరిలో ప్రిలిమ్స్ ఫలితాలు రిలీజయ్యే ఛాన్స్ ఉంది. 2022 సంవత్సరం జనవరిలో మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్లు రిలీజ్ కానుండగా 2022 సంవత్సరం ఫిబ్రవరిలో మెయిన్ ఎగ్జామ్ జరగనుంది. 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో ప్రొవిజనల్ అలాట్‌మెంట్ జరగనుంది.
0 Comments:
Post a Comment