సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ విషయంలో ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్ బర్క్ కీలక ప్రకటన చేశారు. ఫేస్ బుక్ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫేస్ బుక్ కు కొత్తగా మెటాగా నామకరణం చేశారు.
కొత్త వర్చువల్ ప్రపంచాన్ని సృష్టించేందుకే మెటావర్స్ ప్రణాళికను ప్రకటించారు. ఫేస్ బుక్ ను కొందరు దుర్వినియోగం చేయడం, తద్వారా వచ్చిన విమర్శలు.. తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఫేస్ బుక్ ను మెటాగా రీబ్రాండ్ చేశామని తెలిపారు. అక్టోబర్ 28 అనగా గురువారం జరిగిన సమావేశంలో ఫేస్ బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్ బర్గ్ పేస్ బుక్ పేరును మార్చుతున్నట్టు ప్రకటించారు. గోప్యత, భద్రతను దృష్టిలో ఉంచుకునే ఫేస్ బుక్ పేరు మారుస్తున్నట్టు చెప్పారు.
ప్రజలకు అత్యంత చేరువైన ఫేస్ బుక్ ఇకపై మరిన్ని కొత్త ఫియేచర్స్ ను పరిచయం చేస్తోంది. వ్యక్తిగత గోప్యత, భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని జుకర్ బర్గ్ ప్రకటించారు. పేరు మార్చుకు న్న ఫేస్ బుక్ ఇకపై భవిష్యత్తులో మెటావర్స్ కాన్సెప్ట్ గా రూపాంతరం చెందబోతోంది. వినియోగదారులకు వర్చువల్ విధానం పరిచయం కానుంది. రోజు వారీ జీవితంలో తమ పనులు తాము చేసుకుంటూనే.. ఎక్సర్ సైజ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ విషయాన్ని జుకర్ బర్గ జులైలో ప్రకటించినా అది అమల్లోకి రావడానికి మూడు నెలల సమయం పట్టింది. పేస్ బుక్ కంపెనీ రీబ్రాండ్ అయిపోయింది.
ఫేస్ బుక్.. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ లాంటి వాటికి పేరెంట్ కంపెనీగా ఉంది. ఫేస్బుక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టింది. ఫేస్ బుక్ పేరుతోనే ఇది జరగడం వల్ల.. పేరు మార్చడానికి మరో కారణమైంది. వ్యాపార లావాదేవీల కారణంగా ఫేస్ బుక్ పేరు మెటాగా మారిపోయింది. నకిలీ వార్తలను కంట్రోల్ చేయడంలో విఫలమైందని ఇప్పటికే అమెరికన్ కాంగ్రెస్... ఫేస్ బుక్ పై పలు ఆంక్షలు విధించింది. ఈ పరిణాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఫేస్ బుక్ పేరు మార్చేశారు జుకర్ బర్గ్. మరింత టెక్నాలజీని వినియోగదారులకు అందించేందుకు సిద్ధమయ్యారు.
0 Comments:
Post a Comment