ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక
- 11 శాతం డీఏ పెంపు
నవీన్ పట్నాయక్
భువనేశ్వర్, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దసరా కానుక అందించారు.శుక్రవారం 11 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది జులై నుంచి అమలవుతుందని, అక్టోబరులో జీతాలతోపాటు పెరిగిన డీఏ సొమ్ము అందుకుంటారని సీఎం పేర్కొన్నారు. 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 3.5 లక్షల మంది విశ్రాంత ఉద్యోగులకు డీఏ అందనుంది. ఉద్యోగుల గ్రూపు ఇన్సూరెన్స్ నియమావళిలోనూ స్వల్పమార్పులు జరగడంతో ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబాలకు బీమా సొమ్ము అదనంగా లభించనుంది. ఉద్యోగుల డీఏ ప్రస్తుతం 17 శాతంగా ఉండగా పెరిగిన తరువాత 28 శాతమైంది.
0 Comments:
Post a Comment