ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఓ కుదుపు కుదిపి రెండు రాష్ట్రాల విభజనకు కారకుడైన రాజకీయ చతురుడు తెలంగాణ సీఎం కెసిఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పి తనదైన ముద్ర వేసుకుని ఉప రాష్ట్రపతి పదవికి వ్యూహం రచించారు
అన్నఅనుమానులు నిజమే అని తెలుస్తుంది. గత నెలలో రెండు వారాల వ్యవధిలో దాదాపు 10 రోజులు పాటు న్యూ ఢిల్లీలోనే మకాం వేసిన కెసిఆర్ , పలువురు కేంద్ర మంత్రులను కలసి, రాష్ట్ర సమస్యల పై చర్చించారని వార్తలు వచ్చినప్పటికి, వాస్తవం మాత్రం ఉపరాష్ట్రపతి పదవి గురించే అమితా షా , జేపీ నడ్డా సహా పలువురితో అయన చర్చించారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
1) తదుపరి తెలంగాణ సీఎంగా కేటీఆర్
2) బీజేపీతో దోస్తీ -కేంద్రమంత్రిగా హరిశ్ రావు
3) రెండు వారాల వ్యవధి లో 10 రోజులు హస్తినలోనే కెసిఆర్
4) ఢిల్లీ పర్యటన వెనుక మర్మం ఇదే
తెలంగాణ రాష్ట్రం కోసం రాజకీయ పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన కెసిఆర్ తాజాగా డబల్ ధమాకా కోసమే బీజేపీతో దోస్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండవసారి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం నడుపుతున్న కెసిఆర్ తన కుమారుడైన కల్వకుంట్ల తారక రామారావును ముఖ్యమంత్రిగా చేయాలన్న ఉద్దేశంతో
ముందుస్తుగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమించారు. అయన నేతృత్యంలో పార్టీ వ్యవహారాలు బెస్ట్ పెరఫార్మెన్స్ తో కొనసాగుతున్నాయి. టీఅర్ఎస్ పార్టీ రాష్ట్రపతికి ఓటు వేయడం మొదలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మద్దతునిస్తూ చివరకు ఆయుష్మన్ భారత్ పథకాన్ని సైతం ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చడానికి నిర్ణయం తీసుకుంది . ఇక రాజకీయ విషయాల్లో అవసరమైతే బీజేపీతో పొత్తు పెట్టుకుని భవిష్యత్ ఎన్నికలకు వెళ్తూ రాష్ట్రంలో కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తూ జాతీయ స్థాయిలో ఉప రాష్ట్రపతి పదవిపై కెసిఆర్ కన్నేసి ఆ కల నిజం చేసుకునేందకు భాజపాతో దోస్తీకి సంకేతమా ? అని తెలుస్తోంది.
అసలు సీసలైన తెలంగాణ యాసలో గ్రామీణ మండలికంతో ఉపన్యసించే కెసిఆర్ అక్షరాస్యులను సైతం ఆకట్టుకుంటురు. వాక్చాతుర్యంలో తనకెవ్వరు సరిలేరు అన్నవిధంగా కొనసాగించే కెసిఆర్ ఉపన్యాసాలు మారుమూల గోండుజాతి స్త్రీ మొదలు బడా కంపెనీల సీఈఓ ల వరకు అందరు నచ్చే విధంగా మాట్లాడం అయన గొప్పతనం. ఇక ప్రతిపక్షాలును తూర్బారబట్టడంలో ఆయనకు ఎవరూ సాటిరాబోరు. అదే స్థాయిలో తన ప్రతిష్టను పెంచే విధంగా సెటైర్లు వేస్తూ తన వైపు తిప్పుకుంటారు.
0 Comments:
Post a Comment