అన్నీ ఆలోచించాకే పిల్లలకు టీకాపై నిర్ణయం
🌻న్యూఢిల్లీ:
శాస్త్రీయంగా, హేతుబద్ధంగా అధ్య యనం చేసి, కోవిడ్-19 వ్యాక్సిన్ల పంపిణీ పరిస్థితుల్ని అంచనా వేసుకున్నాకే పిల్లలు, కౌమార దశలో ఉన్న వారికి వ్యాక్సినేషన్పై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసు కుంటుందని కరోనా టాస్క్ఫోర్స్ చీఫ్ వి.కె.పాల్ చెప్పారు. ఇప్పటికే చాలా దేశాలు 18 ఏళ్లలోపు వారికి టీకా డోసులు ఇస్తున్నా రని, అయితే తాము అన్ని విధాలుగా ఆలోచిం చిన తర్వాతే పిల్లల వ్యాక్సినికి గ్రీన్ సిగ్నల్ ఇస్తా మని ఆదివారం చెప్పారు. భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాను 2-18 ఏళ్ల వయసు వారికి ఇవ్వొచ్చునని డీసీజీఐ నిపుణుల కమిటీ సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వ్యాక్సిన్లు 18 ఏళ్లు పైబడిన వారికి ఇస్తున్నారు. 2-18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్పై శాస్త్రీయ అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వి.కె.పాల్ స్పష్టం చేశారు.
0 Comments:
Post a Comment