టీసీ లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేరటంపై హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రైవేట్ స్కూల్స్ టీసీలు ఇచ్చే విషయంలో అధికారులు ఒత్తిడి తీసుకురావద్దని హైకోర్టు సూచించింది.
టీసీలు లేని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వక హామీ తీసుకోవాలని కోర్టు తెలిపింది. విద్యార్ధులు టీసీ లేకుండా మరో పాఠశాలలో చేరితే 30 రోజుల్లో పాఠశాలకు వెళ్లి టీసీ తీసుకోవాలని హైకోర్టు సూచించింది. పిటిషనర్ల తరపున ముతుకుమల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపించారు.
0 Comments:
Post a Comment