తల్లిదండ్రుల అనుమతితోనే..‘ఎయిడెడ్’ విద్యార్థుల సర్దుబాటు
🌻ఈనాడు డిజిటల్, అమరావతి: ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో సర్దుబాటు చేసే చర్యల్ని విద్యా శాఖ ప్రారంభించింది. సర్దుబాటు కోసం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వక అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రాథమిక బడుల్లోని విద్యార్థుల్ని కిలోమీటరు, ప్రాథమికోన్నత స్థాయి వారిని మూడు కిలోమీటర్లు, ఉన్నత పాఠశాల స్థాయి వారిని ఐదు కిలోమీటర్లలోపు బడుల్లో చేర్చాలని ఆదేశించింది. ఈ నిబంధనల ప్రకారం పాఠశాలలు అందుబాటులో లేకపోతే కొత్తవి ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని సూచించింది. తల్లిదండ్రుల సమ్మతి లేఖలను ఈ నెల 19లోపు పంపించాలని మండల విద్యాధికారుల్ని జిల్లా అధికారులు ఆదేశించారు. విద్యార్థుల సర్దుబాటు ముగిసిన తర్వాత ఉపాధ్యాయుల్ని ప్రభుత్వ బడుల్లో విలీనం చేయనున్నారు.
0 Comments:
Post a Comment