✍మెరుగైన ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ ప్రకటించాలి
♦సీఎంకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతల విజ్ఞప్తి
🌻ఈనాడు డిజిటల్, అమరావతి:
ఉద్యోగులకు 11వ వేతన సవరణను మెరుగైన ఫిట్‌మెంట్‌తో తక్షణమే అమలుచేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేఆర్ సూర్యనారాయణ, ఆస్కార్‌రావు.. ముఖ్యమంత్రి జగన్‌ను కోరారు. ఐదు విడతల కరవుభత్యం బకాయిల్ని చెల్లించాలని, సీపీఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డు ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. 65 డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. తాము ప్రస్తావించిన అంశాలపై సీఎం సానుకూలంగా స్పందించారని, సమస్యల పరిష్కారానికి అన్ని విషయాలను పూర్తి చేయాలని ఆదేశించినట్లు వివరించారు.
0 Comments:
Post a Comment