అనంతపురం క్లాక్‌టవర్, అక్టోబరు 26: జగనన్న విద్యాదీవెన ద్వారా ప్రభుత్వం అందించే నగదును విద్యార్థులు ఆయా కళాశాలల్లో చెల్లించాలనీ, లేకుంటే తదుపరి వసతిదీవెన, విద్యాదీవెన వారికి కట్ చేస్తామని సాంఘిక సంక్షేమశాఖ డీడీ విశ్వమోహనరెడ్డి తెలిపారు.
జగనన్న విద్యాదీవెన లబ్ధిపొందిన విద్యార్థులు, తల్లులు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాలల్లోని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన అసిస్టెంట్ లాగిన ద్వారా బు ధవారం సాయంత్రంలోపు బయోమెట్రిక్ వేయాలన్నారు. ఈ ఏడాది 2వ విడత జగనన్న విద్యాదీవెన అందుకున్న తల్లులు వెంటనే ఆయా కళాశాలల్లో మొత్తాన్ని చెల్లించాలని సూచించారు. ఇంకా కళాశాలలకు ఫీజు చెల్లించని తల్లులకు అవగాహన కల్పించి, వెంటనే చెల్లించే బాధ్యత వెల్ఫేర్ ఎడ్యుకేషన అసిస్టెంట్, ఎడ్యుకేషన డేటా ప్రాసెసింగ్ కార్యదర్శిలదేనని తేల్చిచెప్పారు. విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి సిబ్బంది బయోమెట్రిక్ వేయించాలని, ఒకవేళ విద్యార్థి ఇంటికి దూరంగా ఉన్న కళాశాలల్లో చదువుతుంటే సమీపంలోని సచివాలయంలో బయోమెట్రిక్ వేయాలన్నారు.
0 Comments:
Post a Comment