వచ్చే నాలుగేళ్లపాటు రెండు భాషల్లో టెక్ట్స్‌బుక్స్ : సీఎం జగన్
ఉన్నత విద్యపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం చేపట్టారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సమీక్షలో సీఎం మాట్లాడుతూ..
తెలుగుమీడియం నుంచి ఇంగ్లిషు మాధ్యంలోకి విద్యార్థులు మారేటప్పుడు వారికి సౌలభ్యంగా ఉండటానికి రెండు భాషల్లో కూడా పాఠ్యపుస్తకాలు రూపొందించాలన్న సీఎం.. వచ్చే నాలుగేళ్లపాటు రెండు భాషల్లో టెక్ట్స్‌బుక్స్ అందించాలని తెలిపారు. ''ఈ ప్రభుత్వం చదువకు ఇచ్చిన ప్రాధాన్యత మరే ప్రభుత్వమూ ఇవ్వలేదు. నాణ్యమైన విద్య ఇవ్వడానికే అనేక చర్యలు తీసుకున్నాం. మంచి చదువులతో కుటుంబాల తలరాతలు మారుతాయి'' అని సీఎం జగన్ తెలిపారు అన్నారు. జగనన్న వసతి దీవెన ద్వారా లబ్ధి పొందుతున్న విద్యార్థుల్లో ఆప్షన్‌గా ఎంపిక చేసుకున్నవారికి ల్యాటాప్‌లు ఇవ్వనున్నామని అధికారులు తెలిపారు.
0 Comments:
Post a Comment