✍ఉద్యోగుల వేతన సవరణలోనూ జాప్యమా!
♦ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా. సాకే శైలజానాథ్
🌻అమరావతి ఆధ్రప్రభ :
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగు లకు పీఆర్సీ అమలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్య క్షులు డా.సాకే శైలాజనాథ్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ ధనవంతులు కాదని, కొందరు స్వార్ధంతో రాజకీయ పార్టీలకు మద్దతు పలుకుతూ తమ స్వార్ధం కోసం ఉద్యోగులను బలి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉద్యోగుల సమస్యల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని శైలజనాథ్ స్పష్టం చేశారు. ఉద్యోగులంతా ఐకమత్యంతో ఇలాంటి ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపిసిసి రాష్ట్ర కార్యాలయం విజయవాడ ఆంధ్రరత్న భవన్ నుంచి ఆయన ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పదకొండవ పీఆర్సీని వెంటనే అమలు పరచాలని, ఉద్యోగుల చిరకాల కోరిక అయిన సీపీఎస్ విధానాన్ని రద్దు పరచాలని వారు కోరు తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదిక సమర్పించి ఏడాది పూర్తయిందని, ఇం తవరకూ రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదికను అమలు చేయలేదన్నారు. 11వ పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, కాట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల పెంపుదల లాంటి ప్రధాన సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరిం చేలా చర్యలు చేపట్టాలని శైలజనాధ్ సూచించారు.
0 Comments:
Post a Comment