విద్యా విషయాలపై దృష్టి సారించండి..
పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్.
🍁విశాఖపట్నం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి):
🔮విద్యాబోధనకు అధిక ప్రాధాన్యతనిచ్చి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ స్పష్టం చేశారు. గురువారం జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయంలో అధికారులతో సమీక్షనిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి ప్రతిభా సామర్థ్యం పెంచేలా బోధన జరగాలన్నారు. ఆ దిశగా ఉపాధ్యాయులంతా కృషి చేయాలని సూచించారు. అంతేకాకుండా ప్రతి విద్యార్థి ప్రతిభకు సంబంధించి వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. డీఈవో నుంచి ఎంఈవో వరకు ప్రతి అధికారి వద్ద తమ పరిధిలో ఉన్న విద్యార్థుల వివరాలు ఉండాలని ఆదేశించారు. గతంతో పోల్చితో పాఠశాలల్లో మౌలిక వసతులు భారీగా పెరిగాయని గుర్తుచేశారు. ఇక నుంచి ఉపాధ్యాయులు బోధనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కాగా టీచర్లు విద్యాశాఖకార్యాలయంలో గడిపే విధానానికి స్వస్తి పలకాలన్నారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ అరుణ్బాబు, పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ జ్యోతికుమారి, డీఈవో ఎల్.చంద్రకళ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment