సేక్రెడ్‌హార్ట్ యాజమాన్యంతో డీఈవో సమాలోచన - ఎయిడెడ్‌గా కొనసాగించాలని విద్యాశాఖకు లేఖ రాయాలని సూచన
🌻ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే, జ్ఞానాపురం:
ఎయిడెడ్ పాఠశాలల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖలో సోమవారం భారీ ఎత్తున జరిగిన ఆందోళనతో ఉన్నతాధికారులు ఆలోచనలో పడ్డారు. ఫలితంగా ఒక్కరోజులోనే పలు మార్పులు చోటుచేసుకోవడం గమనార్హం. తమ పాఠశాలను మూయొద్దని, ఎయిడెడ్‌గా కొనసాగించాలని ‘సేక్రెడ్ హార్ట్’ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తొలిసారిగా రోడ్డెక్కి ప్రభుత్వానికి నిరసన గళం వినిపించిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో పరిస్థితులను పరిశీలించిన జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ మంగళవారం ఆ పాఠశాలకు వెళ్లి యాజమాన్యంతో మాట్లాడారు. పాఠశాలను ‘ఎయిడెడ్’గా కొనసాగించాలని యాజమాన్యం దరఖాస్తు పెట్టుకుంటే విద్యాశాఖ నుంచి వచ్చే ఆదేశాల మేరకు ముందుకు వెళ్దామని చెప్పినట్లు తెలిసింది. విద్యార్థులకు టీసీలు ఇవ్వడంతోపాటు తల్లిదండ్రులను ఒత్తిడి చేయకూడదన్నారు. ఈ విద్యాసంవత్సరం వరకు యథావిధిగా కొనసాగొచ్చని, ఎటువంటి చర్యలు ఉండవని చెప్పారు. ఎయిడ్‌ను రద్దు చేయాలని గతంలో ఇచ్చిన అంగీకార పత్రాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. 2022 ఏప్రిల్ వరకు ఎటువంటి ఇబ్బంది లేదని, పథకాలు ఆగవని తెలియజేశారు. ఈ నేపథ్యంలో తమను ఎయిడెడ్‌గానే కొనసాగించాలని సేక్రెడ్ హార్ట్ బాలికోన్నత పాఠశాలతో పాటు ఆ ప్రాంగణంలోనే నడుస్తున్న ఆర్‌సీ ఎయిడెడ్ ప్రాథమిక, ఆర్‌సీఎం కేథడ్రల్ ఎయిడెడ్ ప్రాథమికోన్నత పాఠశాలల తరఫునా విద్యాశాఖకు లేఖ రాశారు.
0 Comments:
Post a Comment