🔳వేతనానికి వేలిముద్రే ప్రామాణికం
అందరూ బయోమెట్రిక్ వేయాల్సిందేనని తాజాగా ఉత్తర్వు
గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం నుంచి వేతనం రావాలంటే వేలిముద్ర నమోదు(బయోమెట్రిక్)నే ప్రామాణికంగా తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా స్పష్టంచేసింది. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదివారం మరో ఉత్తర్వు జారీ చేశారు. ఇన్నాళ్లు సచివాలయం ఉద్యోగులకు మాత్రమే బయోమెట్రిక్ హాజరు తీసుకుంటున్నారు. ఇకపై ఎవరికీ మినహాయింపు లేదని, పాత పంచాయతీ కార్యదర్శులు, డీడీవోలు, వీఆర్వోలకు సైతం బయోమెట్రిక్ అనుసంధానం తప్పనిసరి చేశామన్నారు. సచివాలయంలో పనిచేసే వివిధ విభాగాల ఉద్యోగులు, సిబ్బంది... సీఎల్, మెడికల్, దీర్ఘకాలిక సెలవులు వాడుకోవాలంటే ఆయా శాఖల మండల, డివిజన్ స్థాయి అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపై సిబ్బంది మొత్తం ఉదయం 10.30 గంటలు, సాయంత్రం 5 గంటలకు రెండు పూటలా బయోమెట్రిక్ వేయాల్సి ఉంది. వీఆర్వోలు, సర్వేయర్లకు మాత్రమే ఏదో ఒక సచివాలయం పరిధిలో వేలిముద్ర వేసేందుకు అనుమతిచ్చారు. మిగతా వారెవరికీ ఈ వెసులుబాటు కల్పించలేదు.
0 Comments:
Post a Comment