మనసున్న టీచరమ్మలు...!
మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులు
ఆకలితో కడుపు మాడ్చుకునే పిల్లలకు అమ్మగా మారిందో ప్రధానోపాధ్యాయిని...
అంధుడైన కుమారుడి కోసం సేవా ప్రస్థానం మొదలు పెట్టి విద్యాలయంలో వసతుల కల్పనకు కృషి చేస్తున్నారు మరో ఉపాధ్యాయిని. ఇందుకోసం తమ జీతంలోని కొంత మొత్తాన్ని వెచ్చిస్తున్నారు. కుటుంబ సభ్యులు సైతం వారిని ప్రోత్సహిస్తున్నారు. ఇద్దరూ చీరాల మండలం ఈపూరుపాలెం పరిధిలోని పాఠశాలల్లోనే విధులు నిర్వహిస్తుండడం విశేషం. - న్యూస్‌టుడే, చీరాల గ్రామీణం
నిత్యం నాణ్యమైన భోజనం...
ఈపూరుపాలెం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను ఓ సమస్య వేధించేది. మధ్యాహ్నం అన్నం కోసం ఇంటికి వెళ్లిన పిల్లలు... తిరిగి బడికి వచ్చేవారు కాదు. దీంతో హాజరు పలుచగా ఉండేది. ఉపాధ్యాయులు ఎంత ప్రయత్నించినా పరిస్థితిలో మార్పు రాలేదు. అదే సమయంలో గ్రామానికే చెందిన రత్నావళి ప్రధానోపాధ్యాయినిగా బాధ్యతలు చేపట్టారు. సమస్యకు మూలం ఆలోచించారు. బడిలో పెట్టే మధ్యాహ్న భోజనం సక్రమంగా లేకపోవడమే ప్రధాన కారణమని గుర్తిôచారు. కొందరు పిల్లలకు తల్లిదండ్రులు లేకపోవడంతో ఇంటికి వెళ్లినా తిండికి తిప్పలు పడేవారు. ఈ నేపథ్యంలో వారి ఆకలి తీరాలన్నా, పాఠశాల పరిస్థితి మెరుగుపడాలన్నా నాణ్యమైన బియ్యంతో అన్నం, రుచికరమైన కూరలు వండి పెట్టడం ఒక్కటే మార్గమని భావించారు. అనుకున్నదే తడవుగా ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలకు విషయం తెలియజేశారు. అందుకయ్యే ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చారు. దీంతో వారూ అంగీకరించారు. అప్పటి నుంచి పిల్లలకు రుచికరమైన భోజనం అందుతోంది. క్రమంగా వారి హాజరుతో పాటు... సంఖ్యా పెరిగింది. వారానికి మూడు బస్తాల వరకు బియ్యం వినియోగిస్తున్నారు. కూరలు, ఇతర పదార్థాలు నాణ్యంగా ఉండేందుకు అవసరమైన సరకులు అందిస్తున్నారు.
పిల్లల అవస్థలు చూసి...
అద్దంకి మండలం శంఖవరప్పాడు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయినిగా పనిచేసినపుడు... బియ్యం నాణ్యత సరిగా లేక భోజనం చేసేందుకు విద్యార్థులు పడిన అవస్థలు స్వయంగా చూశాను. వెంటనే విద్యార్థులకు నాణ్యమైన బియ్యంతో అన్నం తయారు చేయించడం మొదలు పెట్టాం. తరువాత బదిలీపై ఇక్కడకు వచ్చి... అదే విధానాన్ని కొనసాగిస్తున్నాను. విద్యార్థులకు మంచి భోజనం, క్రమశిక్షణతో కూడిన విద్య అందించాలన్నదే లక్ష్యం.
- రత్నావళి, ప్రధానోపాధ్యాయిని, ఈపూరుపాలెం బాలుర ఉన్నత పాఠశాల
0 Comments:
Post a Comment